రాజీనామా చేసిన వాలంటీర్లకు ఏపీ మంత్రి ఆసక్తికర సూచన!
దీంతో... వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందనే క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదని గతంలో ఊహాగాణాలు తెరపైకి వచ్చినా... కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ జీతం 10వేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో... వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందనే క్లారిటీ వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా కొలువుదీరిన ప్రభుత్వంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామికి వాలంటీర్ వ్యవస్థ బాధ్యతలు అప్పగించారు. దీంతో... వ్యవస్థ కన్ ఫాం అనే విషయం కన్ ఫాం అయ్యింది. అయితే... ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఇద్దరు మంత్రులు ఆసక్తికరంగా స్పందించారు.
అవును... ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు ప్రస్తుతం రోడ్లపైకి వస్తున్నారు. ఇందులో భాగంగా... నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బాలరాజు స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు.
అయితే... ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వాలంటీర్లను మాత్రం తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు రాజినామాలు చేసిన వాలంటీర్లకు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఇందులో భాగంగా రాజీనామాలు చేయించినవారిపై కేసులు పెట్టమని వాలంటీర్లకు సూచించారు.
వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని మెరపెట్టుకుంటున్న వాలంటీర్లకు మంచి అచ్చెన్నాయుడు ఆసక్తికర సూచన చేశారు. ఇందులో భాగంగా... మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామాలు చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని.. ఆ తర్వాత తనను కలవాలని.. అప్పుడు ఆలోచిద్దామని అన్నారు.
మరోపక్క ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీంతో... ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది. రాజీనామాలు చేసిన వాలంటీర్లపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోందనేది వేచి చూడాలి.