భారతీయులు సగటున ఎన్ని గంటలు పనిచేస్తారో తెలుసా?
అవును... ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏడాదికి సగటున ఎక్కువ పని గంటలు పనిచేసేది ఎవరు.. తక్కువ పనిగంటలు పనిచేసేది ఎవరు అనే నివేదికలు తాజాగా వెలువడ్డాయి.
సాధారణంగా వయసులో ఉన్నంతకాలం పగలూ రాత్రి అని తేడా తెలియకుండా కష్టపడి పనిచేయాలని.. పెద్ద వయసు వచ్చాక సుఖపడాలని చెబుతుంటారు! అయితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, నగరీకరణలో భాగంగా సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఖర్చు పెట్టుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా గడపడం కూడా అంతే ముఖ్యం అనే అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ప్రపంచంలో ఎక్కువ సమయం పనిచేసేది ఎవరు.. తక్కువ సమయం పనిచేసేది ఎవరు అనే లెక్కలు తాజాగా తెరపైకి వచ్చాయి.
అవును... ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏడాదికి సగటున ఎక్కువ పని గంటలు పనిచేసేది ఎవరు.. తక్కువ పనిగంటలు పనిచేసేది ఎవరు అనే నివేదికలు తాజాగా వెలువడ్డాయి. అయితే ఇందులో... ఎక్కువ పని గంటలు ఉన్న దేశాలలో భారతదేశం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉండటం గమనార్హం. కారణం ఇక్కడ వారానికి 48 గంటల పని అనేది కనీసం!
గ్రామీణ భారతదేశంలో స్వయం ఉపాధి పొందిన పురుషులు 48 గంటలు పనిచేస్తుండగా.. మహిళలు వారానికి 37 గంటలు పని చేస్తున్నారు. అదేవిధంగా సాధారణ వేతనం పొందే గ్రామీణ పురుషులు వారానికి 52 గంటలు పనిచేస్తుండగా, మహిళలు 44 గంటలు పని చేస్తారు. సాధారణ కార్మికులైన గ్రామీణ పురుషులు వారానికి 45 గంటలు, మహిళలు 39 గంటలు పని చేస్తున్నారు.
ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పురుషులు వారానికి 55 గంటలు, మహిళలు 39 గంటలు పని చేస్తుడగా... జీతాలు తీసుకునే పురుషులు వారానికి 53 గంటలు, మహిళలు 46 గంటలు పని చేస్తున్నారు. ఇక పట్టణల్లోని కార్మికుల విషయానికొస్తే... పట్టణ పురుషులు వారానికి 45 గంటలు, మహిళలు 38 గంటలు పని చేస్తున్నారని నివేదిక చెబుతుంది!
ఇక ఓవరాల్ గా దేశాల వారిగా ఏడాది కాలంలో సగటు పని గంటల వివరాలను పరిశీలిస్తే... జర్మనీలో ఏడాదికి సగటున 1349 గంటలు పనిచేస్తారు. అంటే రోజూ 3.6 గంటలు మాత్రమే అన్నమాట. తర్వాత.. డెన్మార్క్ లో సంవత్సరానికి 1363 గంటలు పనిచేస్తారు. అంటే రోజుకు 3.7 గంటలు. ప్రపంచంలో అతితక్కువ సమయం పనిచేసే దేశాలు ఇవేనన్నమాట!
ఇక వీటి అనంతరం బ్రెజిల్ లో కార్మికులు సంవత్సరానికి సగటున 1481 గంటలు పని చేస్తారు.. ఇది రోజుకు 4 గంటలకు సమానం కాగా... యూకేలో ప్రజలు సంవత్సరానికి 1497 గంటలు పనిచేశ్తారు. అంటే రోజుకు 4.1 గంటలు మాత్రమే! ఇక జపనీస్ కంపెనీలో పనిచేసే ప్రతి వ్యక్తి 1607 గంటలు పనిచేస్తారు.. అంటే రోజుకి 4.4 గంటలు!
ఇక అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి సగటున 1,791 గంటలు పనిచేస్తారు. అంటే... రోజుకు 5 గంటలు పని చేస్తాడు. మరోవైపు, మెక్సికోలోప్రతి వ్యక్తికి వార్షిక సగటు పని గంటలు 2,128 కాగా.. అవి రోజుకు 5.83 గంటలతో సమానం!