22న అయోధ్యకు ఎందుకు రాకూడదో చెప్పిన రామమందిర పెద్దమనిషి

ఇలాంటివేళ.. అయోద్యలోని రామమందిర్ ట్రస్ట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న చంపత్ రాయ్ కీలక ప్రకటన చేవారు

Update: 2023-12-17 05:25 GMT

ఏళ్లకు ఏళ్లుగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న రోజు దగ్గరకు వచ్చేస్తోంది. మహా అయితే మరో ముప్ఫై ఐదు రోజుల్లో అయోధ్యలో రామమందిరాన్ని ఓపెన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి వార్తలు భారీగా వస్తున్నాయి. దీంతో.. అయోధ్య రామాలయాన్ని మొదటి రోజునే చూసేయాలన్న ఆసక్తి దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 22న అయోధ్యకు జనసంద్రం పోటెత్తుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటివేళ.. అయోద్యలోని రామమందిర్ ట్రస్ట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న చంపత్ రాయ్ కీలక ప్రకటన చేవారు. అయోధ్యలో రద్దీని నివారించేందుకు వీలుగా ఈ నెల 22న ఎవరూ అయోద్యకు రావొద్దని పేర్కొన్నారు. ఎవరికి వారు.. తమ ఇళ్లకు దగ్గర్లో ఉన్న దేవుడి మందిరాలకు వెళ్లాలన్న సూచన చేశారు. వేడుకలకు అయోద్యకు రావొద్దన్న ఆయన.. జనవరి 22న ఎవరికి వారు తమకు దగ్గర్లోని ఆలయాలకు వెళ్లాలని పేర్కొన్నారు.

జనవరి 22న మధ్యాహ్నం 12 గంటలకు అయోద్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగా వైభవంగా జరుగుతుందని.. గర్భగుడితో పాటు.. విగ్రహం కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే.. మొత్తం ఆలయాన్ని తీర్చి దిద్దేందుకు మరో రెండేళ్లు సమయం పడుతుందన్న ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 22న మాత్రం అయోద్యకు రావొద్దని పేర్కొన్నారు. ఈ ప్రారంభ వేడుకకు వారం ముందే ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు జనవరి 16న షఉరూ కానున్నట్లు పేర్కొన్నారు. రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వేలాదిమంది అయోద్యకు వస్తారని.. అందుకే అయోద్య శివారులో టెంట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య ఆలయానికి పెద్దమనిషిగా ఉండే ఆయన మాటను భక్తులు ఏ మేరకు లెక్కలోకి తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News