అయోధ్యలో విధ్వంసం తప్పదు... ఉగ్రవాది హెచ్చరికలు!
ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు సమయం దగ్గరపడుతున్న వేళ... అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది.
ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు సమయం దగ్గరపడుతున్న వేళ... అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది. ఈ మేరకు రామ్ లల్లా నిలబడి ఉన్న భంగిమలో విశ్వహిందూ పరిషత్ ఫోటోను విడుదల చేసింది! ఈ విధంగా దేశమంతా అయోధ్యలో జరిగే కార్యక్రమ వైపు చూస్తున్న వెళ ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.
అవును... ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఆ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్న వేళ.. ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ హెచ్చరికలు యూపీ సీఎంకు కూడా ప్రమాదం ఉందని తెలిపాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా పలువురుని అరెస్ట్ చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... అయోధ్యలో జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, ఇదే సమయంలో... ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను హత్య చేస్తానని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. శుక్రవారం యూపీ పోలీసులు ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్టు చేసిన నేపథ్యంలో పన్నూ హెచ్చరిక సందేశం పంపాడని తెలుస్తుంది.
ఈ మేరకు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఇందులో... యూపీ ఏటీఎస్ అరెస్టు చేసిన ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అనవసరంగా వేధింపులకు గురి చేయవద్దని అన్నాడు. ఈ క్రమంలో... ఈ రికార్డింగ్ మెసేజ్ బ్రిటన్ కు చెందిన ఓ నంబరు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా... నిఘావర్గాల సమాచారం మేరకు ఖలిస్థానీలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (యూపీ ఏటీఎస్) విభాగం ముగ్గురు యువకులను అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరిని రాజస్థాన్ కు చెందిన సీకర్ వాసి ధరం వీర్ గా గుర్తించారు.