జగన్ చెయ్యి ఎత్తి సర్ అంటే... అయ్యన్న కీలక వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోమారు ఈ వ్యవహారంపై స్పందించారు.
ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవ్వడంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లేదని కూటమి నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే! ఇదే విషయంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు! దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు హాజరవుతానన్నట్లుగా జగన్ వ్యవహార శైలి ఉందని, పులివెందుల ఎమ్మెల్యేగా సభకు రావడం ఆయన కనీస బాధ్యత అని, ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా రావాలని, రూల్స్ ప్రకారం అందరికీ మాట్లాడటానికి సమయం ఇస్తానని అయ్యన్న పాత్రుడు ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోమారు ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీకి రావాలని, వచ్చి మాట్లాడవచ్చని అయ్యన్న స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రతీ సభ్యుడికీ మాట్లాడే అవకాశం ఇస్తామని పునరుధ్ఘాటించారు. జగన్ చెయ్యి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.
ఇక ప్రతిపక్ష నేత హోదా అంశంపై జగన్ కోర్టును ఆశ్రయించిన విషయంపై స్పందించిన స్పీకర్... ఆ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని అయ్యన్న తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో శాసన సభకు హాజరుకాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని అయ్యన్న సూచించారు.
జగన్ బయట మాట్లాడితే తనకు సంబంధం లేదని అన్నారు. ఇదే క్రమంలో. గత ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఘాటుగా రియాక్ట్ అయిన స్పీకర్... కూటమి పాలంతో తిరిగి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చి పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు కుటుంబ సభ్యులతో కలిసి అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పాత రోజుల్ని గుర్తు చేసుకుని ట్వీట్ చేశారు.