టాప్ గేర్ లో చంద్రబాబు.. ఎడాపెడా నిర్ణయాలు

కొన్ని సందర్భాల్లో ఏడాది టైం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు;

Update: 2025-03-27 05:30 GMT
Babu transforming ap with key deicisons

ఎంత ఖరీదైన కారు అయినప్పటికి ఇంజిన్ స్టార్ట్ చేసిన సెకనులోనే అత్యధిక వేగాన్ని పుంజుకోవటం సాధ్యం కాదు. కారు స్థాయిని అనుసరించి 3 నుంచి పది ఇరవై సెకన్ల వ్యవధిలో దూసుకెళ్లేందుకు వీలుగా ఉంటాయి. మరి.. పాలనారథం అందుకు ఏమాత్రం తీసిపోదు. పాలనా వ్యవస్థను పరుగులు తీయించటం అంతే తేలికైన విషయం కాదు. ఐదేళ్లు పాలన సాగించిన ఒక ప్రభుత్వం స్థానంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. మార్పులు చేర్పులకు కనీసం ఆర్నెల్లు పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏడాది టైం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు

ఏపీలో పరిస్థితి కూడా ఇదే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు.. అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే.. అధికార యంత్రాంగాన్ని ఒక కొలిక్కి తీసుకురావటం.. ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దటంతో పాటు.. ప్రభుత్వయ ప్రాధామ్యాల్ని కీలక అధికారులకు అర్థమయ్యేలా చెప్పి.. అందుకు తగ్గట్లు వ్యవస్థల్ని సిద్ధం చేయటం అంత సామాన్యమైన విషయం కాదు.

చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న అధినేత.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వెంటనే అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరి మార్పులు రావట్లేదన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అలాంటి వారికి తన చేతలతో సమాధానం చెప్పేందుకు కాస్త టైం తీసుకున్నారు చంద్రబాబు.గడిచిన రెండు వారాల్లో బాబు పాలన చూస్తే.. మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. వరుస పెట్టి నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. ప్రభుత్వ పాలసీలకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని వేగంగా తీసుకోవటం కనిపిస్తోంది.

తాజాగా తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే.. ఏపీ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాల్ని సరఫరా చేద్దామన్న ప్రతిపాదనతో పాటు.. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు రూ.1.50 కే ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాదు.. జోన్.. నాన్ జోన్ అన్నది లేకుండా ఆక్వా రైతు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరికి రాయితీ మీద విద్యుత్తు అందిద్దామని స్పష్టం చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆక్వా రైతులకు భారీ ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు. అదే సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోపోతే రాయితీ మీద విద్యుత్ ఇవ్వమని తేల్చేశారు.

దీనికి కారణం లేకపోలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ద్వారా.. పన్ను రూపంలో వచ్చే రాబడి ప్రభుత్వ ఖజానాకు మేలు చేయనుంది. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు ఒక హబ్ గా.. రాజమహేంద్రవరం - కొవ్వూరు సమీప ప్రాంతాలు గోదావరి హబ్ గా.. అమరావతి - విజయవాడ, కర్నూలు, సత్యసాయి, అనంతపురాలు మరో హబ్ గా.. తిరుపతి చుట్టుపక్కల పంచాయితీలు ఆ కార్పొరేషన్ తో కలిపి మరో హబ్ గా చేయాలని డిసైడ్ చేశారు.ః

ఈ ఐదు హబ్ లతో రాష్ట్రంలో డెవలప్ చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో హిందూపురం - అనంతపురం మధ్య బాగా డెవలప్ అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం.. కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ మెంట్ పనులు ఇప్పటి నుంచే చేపట్టాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని స్పష్టం చేయటం ద్వారా ఏపీ విజన్ ప్లానింగ్ లో ఎంత సునిశితంగా ఉన్న విషయం అర్థమవుతుంది. ఇలా వరుస పెట్టి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ఇమేజ్ ను మార్చేందుకు.. పాలనారథాన్ని టాప్ గేర్ లోకి తీసుకెళ్లేలా ఉందని చెప్పాలి.

Tags:    

Similar News