బాబు - సీఐడీ... ఏసీబీ కోర్టులో ఇరుపక్షాలకీఎదురుదెబ్బ!
ఈ షాక్ ఏసీబీ కోర్టులో కూడా కంటిన్యూ అయింది. హైకోర్టులో మూడు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కాగా.. ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసులో వేసిన బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది.
గత రెండు రోజులుగా సోమవారం చంద్రబాబుకు మూడు కోర్టుల్లోనూ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అటు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు, ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్, మరోవైపు సుప్రీంలో క్వాష్ పిటిషన్ లపై ఎలాంటి తీర్పులు వస్తాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో సోమవారం ఫస్టాప్ లో ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో ఈ షాక్ ఏసీబీ కోర్టులో కూడా కంటిన్యూ అయింది. హైకోర్టులో మూడు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కాగా.. ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసులో వేసిన బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది.
అవును... ఉదయం హైకోర్టులో రద్దయిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లతో పాటు తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో నాలుగు పిటిషన్లలో ఒక్కదానికి కూడా పాజిటివ్ రిజల్ట్ రాలేదన్నమాట. కాగా... స్కిల్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇదివరకే వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సమయంలో తాజాగా ఆ బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు తీర్పు వెలువరించింది.
ఈ పరిస్థితుల్లో కూడా బాబుకు చెప్పుకోదగ్గ రిలీఫ్ ఏమైనా ఉందంటే.. దాన్ని రిలీఫ్ అని అనుకుంటే.. అది, చంద్రబాబుని కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ని కూడా ఏసీబీ కోర్టు కొట్టివేయడమే! అలాకాకుండా... కస్టడీ పిటిషన్ ని ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుని ఉంటే బాబు మళ్లీ విచారణ కోసం సీఐడీ అధికారుల ఎదుట హాజరవ్వాల్సి ఉండేది.
సుప్రీంకోర్టులో కేసు రేపటికి వాయిదా:
మరోపక్క... స్కిల్ డెవల మెంట్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో జరుగుతున్న క్వాష్ పిటిషన్ పై వాదనలు అవిరామంగా సుమారు రెండున్నర గంటల పాటు జరిగాయి. వాదనలు మొత్తం దాదాపుగా 17ఏ చుట్టూనే తిరిగాయి! ఈ సమయంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసును రేపటికి వాయిదా వేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. ఈ క్రమంలో చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించగా... మంగళవారం సీఐడీ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.