బాబు బండారం : రోజుకొకటి వదులుతామంటున్న వైసీపీ

అందుకే బాబు బండారం అని ఒక క్యాచీ టైటిల్ పెట్టి మరీ వైసీపీ వరస సిరీస్ ని వదలాలని అవి జనాలలో చర్చకు పెట్టాలని డిసైడ్ అయింది.

Update: 2023-09-24 02:30 GMT

టీడీపీ అధినేత నిన్నటిదాకా విజనరీ, ఈ రోజు ప్రిజనరీ. ఈ మాటను వైసీపీ అంటోంది. తమ్ముళ్లను టీజ్ చేస్తోంది. కోర్టు మెట్లు ఎక్కని బాబు ఎట్టకేలకు జైలు గోడల వెనక్కి వెళ్ళారు టైం అంటే ఇదే అని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. చంద్రబాబు దొరకనంతవరకూ దొర. ఇపుడు దొరికిన దొంగ అని వైసీపీ మంత్రులు అంటున్నారు.

మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇపుడు నేనేమీ చేయలేదు అని అంటున్నారు అని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వెటకారం చేశారు. మొత్తానికి టీడీపీ ఇక మీదట మేము క్లీన్ అని చెప్పుకోవడానికి లేదు అన్నది వైసీపీ భావన. తమ నాయకుడు జగన్ని విమర్శిస్తూ జైలు జీవితం అన్న టీడీపీ ఇపుడు అదే దారిలో ఉందని గుర్తు చేస్తుకోవాలంటూ హెచ్చరిస్తోంది.

ఇక పదహారు గంటలు మా బావ జైలులో ఉంటే గొప్పే అన్నట్లుగా మాట్లాడిన బాలయ్య వంటి వారు ఇపుడు పదహారు రోజుల జైలు జీవితానికి వచ్చారు. ఇక మీదట ఎన్ని అయినా జరుగుతాయని వైసీపీ అంటోంది. మరో వైపు చూస్తే చంద్రబాబు ఎన్నో అవినీతి కుంభకోణాలలో ఉన్నారని, స్కిల్ స్కాం చాలా చిన్నది మాత్రమే అని వైసీపీ నేతలు అంటున్నారు.

బాబు బండారం అలా బయటపడింది ఇక ముందుంది ముసళ్ళ పండుగే అంటూ బాబుని ఏ విధంగానూ వదలకూడని డిసైడ్ అయింది. అందుకే బాబు బండారం అని ఒక క్యాచీ టైటిల్ పెట్టి మరీ వైసీపీ వరస సిరీస్ ని వదలాలని అవి జనాలలో చర్చకు పెట్టాలని డిసైడ్ అయింది. ఈ సిరీస్ లో తొలి ఎపిసోడ్ కి ఈ నెల 24వ తేదీని ముహూర్తంగా పెటారు. అంటే అచ్చంగా అందమైన ఆదివారం, సన్ డే వేళ బాబు బండారు తొలి ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తారు అన్న మాట.

దాని పేరు బాబుకు బిగుస్తున్న ఉచ్చు అని పెట్టారు. ఈ మేరకు వైసీపీ ట్వీట్ చేసింది. అంతే కాదు ఈ సిరీస్ లో చాలా విషయాలు ముచ్చటిస్తామని అంటోంది. ఈ సందర్భంగా ఒక ముతక సామెతను కూడా వైసీపీ వాడుతోంది. వంద గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చినట్లుగా. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు ఇన్నేళ్ళలో వ్యవస్థలను మ్యానేజ్ చేసిన చంద్రబాబు చివరికి స్కిల్ స్కాం లో సీఐడీకి చిక్కారని విమర్శించింది.

మొత్తానికి చంద్రబాబుకు చుక్కలు చూపించాలని టీడీపీని ఇంకా వీక్ చేయాలని టీడీపీ మీద జనాలో నెగిటివిటీని పెంచాలని బాబు కేరాఫ్ అవినీతి అన్నది ప్రచారం చేయాలని వైసీపీ గట్టిగా డిసైడ్ అయింది. దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.ముందు ముందు ఎన్నికలు ఉన్న వేళ ఇలాంటి సిరీస్ ని మరిన్ని జనాలలో వదలడం ద్వారా వైసీపీ తన వైపునకు ప్రజలను తిప్పుకునేందుకు రెడీ అయింది అంటున్నారు.

Tags:    

Similar News