0.8 పర్సెంట్ బీజేపీ ఓట్లతో బాబు సీఎం అవుతారా...!?

ఏపీలో బీజేపీ సీన్ ఏంటి అంటే ఆ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెబుతారు. బీజేపీకి ఏపీలో ఏమీ లేదని పెదవి విరుస్తారు.

Update: 2024-03-20 14:32 GMT

ఏపీలో బీజేపీ సీన్ ఏంటి అంటే ఆ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెబుతారు. బీజేపీకి ఏపీలో ఏమీ లేదని పెదవి విరుస్తారు. పైగా 2019 ఎన్నికల ఫలితాలు కళ్ల ముందే ఉన్నాయి. అంతే కాదు ఆ తరువాత 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ అంతకంటే పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏమీ చూపించలేకపోయింది అని కూడా రికార్డులో ఉంది.

ఇన్ని తెలిసి బీజేపీతో ఏపీలో పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఆరు ఎంపీ సీట్లు పది దాకా ఎమ్మెల్యే సీట్లు టీడీపీ సమర్పించుకుంది. దీని మీదనే ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసలు బీజేపీతో పొత్తు టీడీపీకి ఎలా అధికారం తెస్తుంది అన్నది కూడా అంతా అనుకుంటున్న మాట. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన పూర్తిగా భ్రమలలో ఉన్నారని అంటున్నారు.

ఏపీలో నిఖార్సు అయిన పోరి టీడీపీకి వైసీపీకి మధ్యనే ఉంది అన్నది వాస్తవం. ఆ విషయం విస్మరించి బీజేపీని ఏదో గేమ్ చేంజర్ గా భావించి పొత్తులకు టీడీపీ తాపత్రయపడింది అని అంటున్నారు. అంతే కాదు వన్ సైడ్ లవ్ గా చంద్రబాబు పట్టుబట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నారు అని ప్రచారంలో ఉన్న మాట.

అక్కడికి బీజేపీ ఏపీలో బలమైన ఫోర్స్ గా ఉన్నట్లుగా టీడీపీ భావిస్తోందా అన్నదే చర్చగా ఉంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో వచ్చినవి 0.8 శాతం ఓట్లు మాత్రమే. నోటాతో పోటీ పడి ఓడిన పార్టీగా బీజేపీ ఉంది. అలాంటి ఓట్లతో బీజేపీ ఏపీలో గేమ్ చేంజర్ ఎలా అవుతుంది అన్నది అంతా అంటున్న మాట.

అదే జనసేన విషయం తీసుకుంటే 2019 ఎన్నికల్లో ఆరు శాతం దాకా ఓట్లు వచ్చాయి. ఏపీ రాజకీయాల్లో ఈ ఆరు శాతం చాలా కీలకంగానే ఉంది. ఒక విధంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా జనసేన ఉందని అంటున్నారు. మరి కేవలం 0.8 శాతం ఓట్లు ఉన్న బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం అంటే ఏమిటిది అని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది.

బీజేపీకి వచ్చిన ఓట్లు ప్రతీ ఎంపీ సీట్ లో దారుణంగా ఉన్నాయి. అలాంటిది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎంపీ సీట్లను అరడజన్ దాకా కట్టబెట్టడం అంటే టీడీపీ వ్యూహాత్మకంగా తప్పు చేసింది అని అంటున్నారు. అదే ఈ రోజున పెద్ద మైనస్ గా మారుతోంది అని అంటున్నారు.

ఇలా పొత్తుల ఎత్తులతో తాను అధికారంలోకి వస్తాను అని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది కానీ నిజంగా చూస్తే కనుక ఈ పొత్తులు అన్నవి ఆ పార్టీకి గుదిబండగా మారుతున్నాయని అంటున్నారు. బీజేపీకి జనసేనకు కలిపి 31 అసెంబ్లీ సీట్లు అలాగే, ఎనిమిది దాకా ఎంపీ సీట్లను ఇచ్చేశారు. ఆయా చోట్ల టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. సీనియర్ లీడర్స్ ఉన్నారు.

వారంతా మాత్రం ఈ రోజుకీ అడ్జస్ట్ కావడంలేదు అని అంటున్నారు. చంద్రబాబు అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. బుజ్జగిస్తున్నారు. కానీ అక్కడ ఓకే అనేసినా నియోజకవర్గాలకు వచ్చినపుడు తమ క్యాడర్ కి వారు సర్దిచెప్పుకోలేకపోతున్నారు. అదే విధంగా వారు కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నారని అంటున్నారు. దీంతో ఈ పొత్తులకు సంబంధించి ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఓట్ల బదిలీ సాఫీగా సాగితేనే పొత్తుల ఫలితం ఉంటుంది. అది జరగాలంటే అవతల పొత్తు పార్టీలకు కూడా సొంతంగా సత్తా ఉండాలి. వారు కూడా కొంత బలం చూపించాలి. జీరో నుంచి మొదలుపెడితే ఎంత దూరం మోస్తారు, కొసవరకూ ఎవరూ ఎక్కించలేరు కదా అని అంటున్నారు. అది కూడా అన్ని రకాలైన త్యాగాలు చేసి చేయడం అంటే మా వల్ల కాదు అనే క్యాడర్ చేతులు ఎత్తేస్తోంది అని అంటున్నారు.

అయినా బీజేపీని బాహుబలిగా భావించడం అతి పెద్ద తప్పు అని అంటున్నారు. ఆ పార్టీ ఏపీలో రాజకీయాన్ని మలుపు తిప్పుతుందని ఆశించడం కూడా తప్పు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక బీజేపీ తనను సీఎం చేస్తుంది అని భ్రమలలో బాబు ఉంటే అంతకంటే రాజకీయంగా తప్పుడు అంచనా ఉండదు అని అంటున్నారు.

ఏపీలో ఏమి చేసినా టీడీపీయే చేయాలి. ఆ పార్టీ బలమే ప్రత్యర్ధులకు పంచాలి. మరి ఇంతోటి దానికి పొత్తులు పేరు చెప్పుకుని కూటమి కట్టి బలంగా ఉన్నామని బిల్డప్పులు ఇవ్వడం ఎందుకు అన్న ప్రశ్నలు వస్తునాయి. దీని వల్ల అసలైన తమ్ముళ్లకు సీట్ల కోత పడి తీరం అన్యాయం జరగడం ద్వారా గ్రొండ్ లెవెల్ లో పడాల్సిన ఓట్లు కూడా తగ్గిపోతున్నాయి అంటున్నారు.

Tags:    

Similar News