బిగ్ బ్రేకింగ్: బాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా!

అవును... స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణకై ఐదు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ కు సంబంధించిన తీర్పును జడ్జి వాయిదా వేశారు!

Update: 2023-09-21 13:20 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబును ఐదురోజుల పాటు సీఐడీ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై మళ్లీ అదే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో గురువారం సాయంత్రానికైనా వస్తుందనుకున్న తీర్పు విషయంంలో ట్విస్ట్ వచ్చింది.

అవును... స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణకై ఐదు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ కు సంబంధించిన తీర్పును జడ్జి వాయిదా వేశారు! ఇందులొ భాగంగా... శుక్రవారం ఉదయం 10:30గంటలకు నిర్ణయం వెలువరించనున్నట్టు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

అయితే దీనిపై తీర్పు ఇచ్చే ముందు హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారని.. ఇందులో భాగంగా హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగారని తెలుస్తుంది. అయితే దీనికి సమాధానంగా... హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌ లో ఉందని చంద్రబాబు తరుపు లాయర్లు చెప్పారని అంటున్నారు.

అనంతరం... హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఏసీబీ కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలపై స్పందించిన న్యాయమూర్తి... కస్టడీ పిటిషన్‌ పై రేపటి వరకు వేచి చూద్దామని చెప్పారని అంటున్నారు. దీంతో రేపటి హైకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

కాగా... ఈ కస్టడీ పిటిషన్‌ పై ఏసీబీ కోర్టులో బుధవారం వాడీవేడీగా వాదనలు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉందని.. చంద్రబాబుని కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని, ఈ స్కాంలో నిజానిజాలు బయటకు వస్తాయని సీఐడీ తరుపున ఏఏజీ వాదనలు వినిపించారు.

మరోపక్క అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, చంద్రబాబు అవినీతి చేసినట్టు ఎక్కడా ఆధారాల్లేవని, రిమాండ్ అవసరం లేదని చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీంతో ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News