బాబు మాటకు అర్థమేంటి? 'ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులున్నాయి'!

గడిచిన ఐదేళ్లలో అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారుల తీరు తనను బాధకు గురి చేసందని వ్యాఖ్యానించారు.

Update: 2024-06-14 04:25 GMT

ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన చంద్రబాబును అభినందించేందుకు వచ్చిన ఐఏఎస్.. ఐపీఎస్ లతో కలిసి భేటీ అయ్యారు చంద్రబాబు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీనియర్ అధిరుల్ని ఉద్దేశించి ఐదారు నిమిషాలు మాత్రమే మాట్లాడిన చంద్రబాబు.. తాను చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశారు. గడిచిన ఐదేళ్లలో అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారుల తీరు తనను బాధకు గురి చేసందని వ్యాఖ్యానించారు.

‘‘నాకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేనెప్పుడూ మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్లీ మీతో వివరంగా మాట్లాడతా. వ్యవస్థల్ని మళ్లీ పరిపాలనా గాడిలో పెడతా. గత ఐదేళ్లలో కొందరు ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు వ్యవహరించిన తీరు చాలా బాధించింది. చాలా అన్యాయంగా ప్రవర్తించారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బ తీశారు’’ అంటూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేశారు. గతంలో చంద్రబాబును.. ఆయన తీరు గురించి తెలిసిన సీనియర్ అధికారులంతా తాజా తీరుకు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇలాంటి మాటలు గతంలో ఎప్పుడూ చంద్రబాబు నోటి నుంచి రాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

గడిచిన ఐదేళ్లలో జరిగిన ఏ విషయాన్ని తాను మార్చిపోలేదన్న విషయాన్ని చెప్పటమేకాదు.. ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్య చేశారు. ఒకట్రెండు రోజుల్లో తాను పూర్తి చేయాల్సిన పనులుకొన్ని ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో పాలన మీద ఫోకస్ చేస్తానని చెప్పటం గమనార్హం. ఇంతకూ ఒకట్రెండు రోజుల్లో ఏం చేయనున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ రెండు రోజుల్లో పలువురు అధికారుల్ని మార్చటం.. కీలక స్థానాల్లో ఉన్న వివాదాస్పద అధకారుల విషయంలో మార్పులు చేసి.. పాలన మీద మరింత ఫోకస్ పెంచే వీలుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News