హమ్మయ్య అనుకునేలా ములాఖత్ లపై బాబుకు స్వల్ప ఊరట

అనూహ్య రీతిలో తెర మీదకు వచ్చిన స్కిల్ స్కాం కేసులో ఏపీ విపక్షనేత చంద్రబాబు అరెస్టు కావటం.. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండటం తెలిసిందే.

Update: 2023-10-21 04:36 GMT

కేసుల మీద కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాబుకు.. బెయిల్ ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళ.. బెయిల్ కంటే కూడా తన లాయర్లతో భేటీ అయ్యేందుకు ములాఖత్ లు ఎక్కువగా ఉండాలన్నది ఆయన తక్షణ అవసరంగా మారింది. అయితే.. ఆయనకు రోజుకు ఒక్క ములాఖత్ కు మాత్రమే అవకాశం ఇవ్వటంతో ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. పలు పరిణామాల అనంతరం ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఆయనకున్న ములాఖత్ సంఖ్యను పెంచుతూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనూహ్య రీతిలో తెర మీదకు వచ్చిన స్కిల్ స్కాం కేసులో ఏపీ విపక్షనేత చంద్రబాబు అరెస్టు కావటం.. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండటం తెలిసిందే. చూస్తుండగానే ఆయన జైలుకు వెళ్లి దగ్గర దగ్గర 40 రోజులవుతోంది. బెయిల్ కోసం ఆయన ఓపక్క ప్రయత్నాలు చేస్తున్న వేళ.. మరోవైపు కొత్త కేసులు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎప్పుడూ లేనంత ఎక్కువసార్లు లాయర్లను ఆయన కలవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆయనకు రోజుకు ఒక్క ములాఖత్ కే అవకాశం ఇస్తూ జైలు అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.

ఆయనకు ఎక్కువసార్లు ములాఖత్ లు ఉంటే.. భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయన్నది జైలు అధికారుల వాదన. దీన్ని తప్పు పడుతూ.. రోజుకు కనీసం రెండుసార్లు ములాఖత్ లకు అవకాశం ఇవ్వాలని.. ఒక్కో ములాఖత్ 40-50 నిమిషాల వ్యవధి ఉండాలని చంద్రబాబు కోర్టును విన్నవించారు. పలు కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో లాయర్లతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం అవసరం అవుతుందని.. అందుకే ములాఖత్ ల సంఖ్యను పెంచాలని ఆయన అభ్యర్థించారు.

తొలుత ములాఖత్ ల పెంపు అభ్యర్థనకు సంబంధించిన పిటిషన్ లో ప్రతివాదుల్ని చేర్చకపోవటంపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణకు నో చెప్పింది. ప్రతివాదులు లేని దానిపై ఏమని విచారణ చేయాలని ప్రశ్నించింది. దీంతో.. మరోసారి కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు న్యాయవాదులు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. ఈ రోజు (శనివారం) నుంచి రోజుకు రెండుసార్లు ములాఖత్ లు అయ్యేందుకు వీలుగా అనుమతులు ఇస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News