బాబు గారూ మారి పోయారు సార్...అంతే...!
మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ వెళ్తే ఆయనకు ఎలాంటి మొహమాహట లేకుండా బాబు గారు నో అని చెప్పేశారు అని అంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మారిపోయారు. ఆయన నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఒక ఎత్తు అయితే 2019 ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు. ఆ ఫలితాలు బాబు గారిని పూర్తిగా మార్చేశాయి. ఇంకా చెప్పాలంటే చాలా నేర్పించాయి. అందుకే బాబు దగ్గర దశాబ్దాలుగా ఉండే మొహమాటం అన్న బలహీనత ఇపుడు పూర్తిగా దూరం అయిపోయింది అని అంటున్నారు.
అందుకే బాబు గారి దగ్గరకు వెళ్ళి గతంలో మాదిరిగా టికెట్ కోసం చేసే ఓల్డ్ టైప్ ప్రయత్నాలు చెల్లవని అనేక రుజువులు కనిపిస్తున్నాయని అంటున్నరు. దానికి లేటెస్ట్ ఉదాహరణ ఏంటి అంటే ఉమ్మడి విశాఖ జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ వెళ్తే ఆయనకు ఎలాంటి మొహమాహట లేకుండా బాబు గారు నో అని చెప్పేశారు అని అంటున్నారు.
ఇంతకీ ఈ కిడారి శ్రావణ్ కుమార్ ఎవరంటే 2018 లో మావోయిస్టుల దాడిలో దారుణ హత్యకు గురి అయిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు. వైసీపీ లో గెలిచి టీడీపీలో చేరిన సర్వేశ్వరరావుని మావోలు మాటు వేసి హత్య చేశారు. ఆ సానుభూతి కవర్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో ఉన్నఫళంగా ఆయన కుమారుడు శ్రావణ్ ని మంత్రిని చేశారు చంద్రబాబు
అంతే కాదు 2019 ఎన్నికలలో అరకు టికెట్ కూడా ఇచ్చారు. అయితే జగన్ వేవ్ తో పాటు ఏజెన్సీలో బాగా వైసీపీకి పట్టు ఉండడంతో అక్కడ చెట్టి ఫల్గుణ గెలిచారు. ఇక వైసీపీలోనే రెబెల్ గా ఉంటూ పోటీ చేసిన దొన్ను దొరకు సెకండ్ ప్లేస్ వస్తే టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రావణ్ కుమార్ డిపాజిట్లు పోగోట్టుకున్నారు. ఒక మంత్రిగా ఉంటూ డిపాజిట్లు పోగోట్టుకున్న హిస్టరీని ఆయన అలా క్రియేట్ చేశారు.
మరో వైపు చూస్తే గడచిన నాలుగేళ్ళ కాలంలో సైతం శ్రావణ్ కుమార్ పార్టీని అరకులో ఏ మాత్రం పటిష్టం చేయలేకపోయారు అని అధినాయకత్వం భావిస్తోంది. దాంతో ఆయనకు టికెట్ అంటే టిక్కు పెట్టారని తెలుస్తోంది. అదే టైం లో వైసీపీ మీద పోటీకి దిగి రెండవ ప్లేస్ లోకి వచ్చిన దొన్ను దొరకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని అంటున్నారు.
ఈసారి విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు కూడా టీడీపీ పరం కావాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అదే విధంగా మొహమాటాలకు పోయి ఏ ఒక్క సీటు పోగొట్టుకున్నా అది 2024 ఎన్నికల్లో తెలుగుదేశం విజయావకాశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. ఈ కారణం చేత చంద్రబాబు గతంలో ఉన్న మొహమాటాలు పక్కన పెట్టి మరీ గెలుపు గుర్రాలనే ఎంచుకుంటున్నారని అంటున్నారు. ఎంతటి సన్నిహితులు అయినా గెలిచే సీన్ లేకపోతే వద్దే వద్దు అని అనుకుంటున్నారుట. సో బాబు గారి తీరు చూసి చాలానే మారిపోయారు సారు అని తమ్ముళ్ళు అనుకుంటుంటున్నారుట.