బాబుకు జైలే పదిలం...అక్కడే భద్రం

చంద్రబాబుకు జైలే పదిలం. ఆయనకు అక్కడే ఉంటేనే సురక్షితం. ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టు కూడా నిర్ధారించింది. ఈ మేరకు సంచలన తీర్పుని ఇచ్చింది.

Update: 2023-09-12 12:11 GMT

చంద్రబాబుకు జైలే పదిలం. ఆయనకు అక్కడే ఉంటేనే సురక్షితం. ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టు కూడా నిర్ధారించింది. ఈ మేరకు సంచలన తీర్పుని ఇచ్చింది. గత రెండు రోజులుగా చంద్రబాబు హౌస్ అరెస్ట్ కోసం ఆయన తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వాదిస్తూ వచ్చారు. గంటల పాటు జరిగిన ఈ వాదనలో చివరికి చంద్రబాబు తరఫున దాఖలు చేసిన పిటిషన్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

బాబుకు జైలే భద్రం, అక్కడే ఆయన సేఫ్ అని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా సీఆర్పీ యాక్ట్ లో ఉన్నవి రెండే రెండు కస్టడీలు అని ప్రభుత్వం తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. ఒకటి జ్యుడీషియల్ కస్టడీ, రెండవది పోలీస్ కస్టడీ.

ఈ రెండు కస్టడీలు తప్ప హౌస్ అరెస్ట్ హౌస్ కస్టడీ అని మూడవది లేనే లేదని ఆయన చేసిన వాదంతో ఏసీబీ కోర్టు అంగీకరించింది. మరో వైపు చూస్తే చంద్రబాబు విషయంలో ఆయన న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు ఇలా వరసబెట్టి వీగిపోవడం ఇదే ప్రధమం. బాబుకు రాజమండ్రి కోర్టులో పూర్తి సెక్యూరిటీ ఉందని కూడా చెబుతున్నారు.

అయితే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ తాను చంద్రబాబుతో మాట్లాడానని చెప్పారు. ఆయనకు అక్కడ నంబర్ వన్ సదుపాయాలు కల్పించడంలేదని అన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో కూడా తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుందని మానవీయ కోణంలోనే ఆలోచిస్తోంది అని ప్రభుత్వ న్యాయవాది సుధాకరరెడ్డి చెప్పారు. బాబుకు ఇంటి నుంచి ఆహారంతో పాటు ఆయనకు అవసరం అయిన మందులు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. బాబు భద్రత ప్రభుత్వం బాధ్యత అన్నారు.

చంద్రబాబుని సకల సదుపాయాలతోనే జైలులో ఉంచడం జరిగిందని రాజమండ్రి జైలులో ఒక బ్యారక్ మొత్తం బాబుకే కేటాయించారని ఇక అక్కడ శత్రు దుర్భేధ్యంగా ఒక కోటగా అంతా మార్చారని కూడా తెలిపారు. చంద్రబాబు విషయంలో అని కాదు కానీ ఏ రిమాండ్ ఖైదీ వీఐపీ అయినా ఇటువంటి సదుపాయాలు గతంలో ఎపుడూ అందించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం వాటిని సమకూరుస్తోందని అన్నారు.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు జైలు జీవితం మాత్రం బెయిల్ వచ్చే వరకూ రాజమండ్రి జైలులో కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన న్యాయవాదులు ఎంత పోరాడుతున్నా చట్టం ప్రకారం నిబంధలన ప్రకారం అది కుదిరేది కాదు అని అంటున్నారు. బాబుని రిమాండ్ ఖైదీగా చూడాలేమని ఎవరైనా అనుకున్నా చట్టం ముందు అది సాగదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అంటున్నారు.

Tags:    

Similar News