మంత్రుల‌కు 'ప్ర‌జాద‌ర్బార్‌' డ్యూటీలు: చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఈ క్ర‌మంలో కీల‌క నాయ‌కులు స‌హా మంత్రుల‌కు కూడా 'ప్ర‌జాద‌ర్బార్ డ్యూటీలు' వేశారు.

Update: 2024-08-01 01:30 GMT

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించి.. వారి స‌మ‌స్య‌లు ఓపిక‌గా వింటూ.. వారికి స్వాంత‌న క‌లిగించే కార్య‌క్ర‌మం ప్ర‌జాద‌ర్బార్‌. ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రి నారాలోకేష్ ముందుగా ప్రారంభించారు. దీనిని త‌ర్వాత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా కొన‌సాగిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా సాగిపోయినా.. ఇక నుంచి దీనిని క్ర‌మ‌ప‌ద్ధతిలో నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో కీల‌క నాయ‌కులు స‌హా మంత్రుల‌కు కూడా `ప్ర‌జాద‌ర్బార్ డ్యూటీలు` వేశారు.

ఏదో మొక్కుబ‌డిగా వ‌చ్చి వెళ్ల‌డం కాదు.. మొక్కుబ‌డిగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం కూడా కాదు. విధిగా ఉద‌యం 7 గంట‌ల క‌ల్లా నిర్ణీత డ్యూటీలో ఉన్న‌ మంత్రులు మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డంతోపాటు.. ప్ర‌జాద‌ర్బార్‌లో పాల్గొనాల‌ని కూడా.. చంద్ర‌బాబు ఆదేశించారు. దీని ప్ర‌కారం.. కేవ‌లం ఒక‌రిద్ద‌రు మంత్రులు మాత్ర‌మే కాకుండా.. అంద‌రికీ ప్ర‌జాద‌ర్బార్‌లో భాగ‌స్వామ్యం క‌ల్పిస్తున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు స‌త్వ‌ర‌మే ప‌రిష్కారం అవుతాయ‌ని కూడా చెతున్నారు. ఈ క్ర‌మంలో తొలిసారి ఆగ‌స్టు నెల‌కు సంబంధించి మంత్రుల‌కు ప్ర‌జాద‌ర్బార్ డ్యూటీలు వేశారు.

ఆగ‌స్టు నెల తొలి 15 రోజుల్లో డ్యూటీలు ఇలా..

1వ తేదీ: ప‌ర్చురి అశోక్‌బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా.

2వ‌తేదీ: మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్.

3వ తేదీ: సీఎం చంద్రబాబు, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్.

5వ తేదీ: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, బొల్లినేని రామారావు.

6వ తేదీ: మంత్రి వంగలపూడి అనిత, బీద‌ రవిచంద్ర యాద‌వ్‌.

8వ తేదీ: మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి జవహార్.

9వ తేదీ: మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ ఏపీ చీఫ్‌ పల్లా శ్రీనివాస్ యాదవ్.

10వ తేదీ: సీఎం చంద్రబాబు, ప‌ల్లా శ్రీనివాస్ యాదవ్.

12వ తేదీ: మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి, వర్ల రామయ్య.

13వ తేదీ: మంత్రి టీ.జీ. భరత్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి.

14వ తేదీ: మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. కిషోర్ కుమార్ రెడ్డి.

ఏం చేస్తారు?

+ ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు వింటారు.

+ త‌క్ష‌ణం ప‌రిష్కారం అయ్యేవాటికి ప‌రిష్కారం చూపుతారు.

+ ముఖ్య‌మంత్రి ఆర్థిక సాయం కోరే వారి జాబితాను రెడీ చేస్తారు.

+ దీనికి సంబంధించిన ప‌త్రాలు సేక రిస్తారు.

+ ఆర్థికేత‌ర అంశాల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తారు.

+ సివిల్ వివాదాల జోలికి పోరు.

+ న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌పై స‌ల‌హాలు ఇచ్చేందుకు టీడీపీ లీగ‌ల్ సెల్‌కు సిఫార్సు చేస్తారు.

+ రూ.10 లోపు ఆర్థిక సాయం కోరే వారి విష‌యంలో త‌క్ష‌ణ నిర్ణ‌యం తీసుకుంటారు.

+ ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధులుగా ప‌నిచేస్తారు.

Tags:    

Similar News