టాక్ ఆఫ్ ది ఢిల్లీగా బాబు !

మోడీతో పాటు చంద్రబాబుని కూడా లోక్ సభలో విపక్ష ఎంపీలు విమర్శించడం ఈసారి సమావేశాలలో కొత్త విషయం.

Update: 2024-07-03 19:05 GMT

కరెక్ట్ సమయంలో టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. 18వ లోక్ సభ మొదటి సమావేశాలు వాడిగా వేడిగా సాగి బుధవారంతో ముగిసాయి. ఆ రోజు రాత్రి బాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమావేశాలు ఎంతటి రచ్చగా సాగాయో తెలిసిందే.

మోడీతో పాటు చంద్రబాబుని కూడా లోక్ సభలో విపక్ష ఎంపీలు విమర్శించడం ఈసారి సమావేశాలలో కొత్త విషయం. సాధారణంగా అధికార పార్టీని విమర్శిస్తారు. భాగస్వామ్య పార్టీల గురించి పెద్దగా ఎవరూ మాట్లాడరు. కానీ కోరి మరీ చంద్రబాబుని ముగ్గులోకి లాగారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాబు ప్రస్తావన తీసుకుని వస్తూ ఆయన మీద సీబీఐ ఈడీ కేసులు ఎందుకు నమోదు చేయరని ఎన్డీయే సర్కార్ పెద్దలను ప్రశ్నించడం బాబు అవినీతిపరుడు అని విమర్శించడం బట్టి చూస్తే మోడీ కంటే టార్గెట్ బాబు అన్నట్లుగానే జాతీయ స్థాయిలో విపక్షాలు ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే మోడీ సర్కార్ ఏర్పాటు అయిందే టీడీపీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీ మద్దతుతో. అలాగే జేడీయూ తో కూడా. అయితే జేడీయూని పక్కన పెట్టి టీడీపీనే విమర్శించడం వెనక ఉద్దేశ్యాలు ఏమిటి అన్నదే చర్చగా ఉంది. జేడీయూ కేంద్రాన్ని నిలదీస్తోంది. ఇరుకున పెడుతోంది. ప్రత్యేక హోదా అంటోంది. అదే చంద్రబాబు కేంద్రంతో సామరస్యంగా ఉంటున్నారు. ఆయన ఏ పేచీలూ పెట్టడం లేదు.

Read more!

బాబు వంటి బలమైన నాయకుడు ఎంతకాలం అండగా ఉంటే అంతకాలం ఎన్డీయే సర్కార్ కి వచ్చిన ముప్పు ఏమీ లేదు అన్నది విపక్ష నేతలకు తెలుసు. అంతే కాదు బాబు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నంత కాలం జేడీయూ కూడా ఎంత తోక జాడించినా మద్దతు ఉపసంహరణ వంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోలేదు. జేడీయూ బయటకు వెళ్ళినా వచ్చిన నష్టం కూడా ఉండదు.

దాంతో బాబుకే కెలికితే ఎన్డీయే కూటమిలో అస్థిరత చెలరేగుతుందనే విపక్షాలు కొత్త ఎత్తు వేశాయని అంటున్నారు. దాంతోనే విపక్ష కూటమి నేతలు విమర్శలు బాబు మీద కూడా ఎక్కుపెడుతున్నారు. ఇక బాబు ఢిల్లీలో ఈ కీలకమైన సమయంలో అడుగు పెట్టారు.

దాంతో అందరి దృష్టి బాబు మీద ఉంది. బాబు ఈసారి హస్తిన రాక ఒక అట్టహాసంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం ఆయనకు రాచ మర్యాదలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ బలం ఎక్కడ ఉందో కూడా అందరికీ తెలుసు. అందుకే బాబు మీదనే అందరి ఫోకస్ ఉంది. అలా టాక్ ఆఫ్ ది ఢిల్లీగా బాబు మారిపోయారు.

ఇక బాబు ఢిల్లీలఒ మూడు రోజుల పాటు ఉంటారని తెలుసోంది. ఆయన ఏపీ రాజకీయాల గురించి ప్రభుత్వానికి అవసరం అయ్యే నిధులు పెండింగు ప్రాజెక్టుల సమస్యలు అన్నీ చెబుతూనే జాతీయ రాజకీయాల మీద కేంద్ర పెద్దలతో చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా బీజేపీ పెద్దలు కూడా బాబుతో జాతీయ స్థాయిలో ఇటీవల సంభవించిన పరిణామాల గురించి చర్చిస్తారు అని అంటున్నారు.

జేడీయూ ప్రత్యేక హోదా నినాదాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద గుత్తా మొత్తంగా విపక్షం అంతా కలసి చేస్తున్న రాజకీయ దాడి వంటి అంశాలు కూడా బాబుతో కేంద్ర పెద్దలు పంచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బాబు ట్రబుల్ షూటర్ గా కూడా ఉంటారు. ఆయన ఇప్పటికి ముప్పయ్యేళ్ళ క్రితమే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఇండియా కూటమిలో ఉన్న వారందరితోనూ బాబుకు పరిచయాలు ఉన్నాయి. దాంతో బాబుని మరింత దగ్గరకు తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొనే ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. బాబు మూడు రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. మొత్తానికి బాబు మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పుతారా తాజా రాజకీయ పరిణామాల మీద ఆయన మార్క్ ఆలోచనలు ఏమిటి అన్నది తొందరలోనే తెలుస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News

eac