బాబు పవన్ కసరత్తు : ఫిబ్రవరిలో లిస్ట్ విడుదల...!
సర్వేలను చేసి ఉన్నామని నమ్మకమో లేక క్యాండిడేట్ మారిస్తేనే గెలుస్తామని విశ్వాసమో తెలియదు కానీ వైసీపీ మాత్రం క్యాండిడేట్ సెలెక్షన్ లో విపక్షానికి అందనంత ఎత్తులో ఉంది
ఏపీలో మొత్తం 175 సీట్లలో దాదాపుగా తమ అభ్యర్ధులను ప్రకటించుకుంటూ అధికార వైసీపీ వెళ్తోంది. నిజానికి విపక్షం ఈ విషయంలో ముందుండాలి. ఎందుకంటే వారి దగ్గర చాలా ఖాళీలు ఉంటాయి. కానీ గెలిచిన పార్టీ అయితే మాత్రం జోరు పెంచేస్తోంది. తమ వద్ద సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కూడా కాదనుకుని కొత్త వారికి చాన్సులు ఇస్తోంది.
సర్వేలను చేసి ఉన్నామని నమ్మకమో లేక క్యాండిడేట్ మారిస్తేనే గెలుస్తామని విశ్వాసమో తెలియదు కానీ వైసీపీ మాత్రం క్యాండిడేట్ సెలెక్షన్ లో విపక్షానికి అందనంత ఎత్తులో ఉంది. ఫైనల్ లిస్ట్ కొద్ది రోజులలో వచ్చే చాన్స్ ఉంది.
మరి విపక్షం సంగతి ఏంటి అంటే అలాగే ఉంది. అభ్యర్ధుల విషయం కొలిక్కి వస్తేనే తప్ప జనంలోకి వెళ్లినా సుఖం లేదు. లేకపోతే వారూ వీరూ అంతా వచ్చి మీద పడతారు. పైగా ఎవరు అభ్యర్థి అని అనుకుంటే ప్రచారం చేసినా ఫలితం ఉంటుంది.
అందుకే గత నాలుగు నెలలుగా పవన్ కళ్యాణ్ వారాహి రధం బయటకు తీయడం లేదు. ఇపుడు చూస్తే ఆయన వత్తిడి ఫలించి చంద్రబాబు సై అన్నారని టాక్. సో ఇద్దరు నాయకులు కలసి అభ్యర్ధుల జాబితా విషయంలో కసరత్తు స్టార్ట్ చేశారు అన్నది ఒక హాట్ టాపిక్. ఏపీలో జనవరి నెల అంతా బాబు రా కదలిరా అంటూ ఒక చుట్టు చుట్టేశారు. ఆయన పండుగ నాలుగైదు రోజులు తప్పించి మొత్తం ఏపీ అంతా కలియతిరిగారు. ఆల్ సెగ్మెంట్స్ ని టచ్ చేశారు. ఏపీలో ఉన్న అన్ని రీజియన్ లలో మీటింగ్స్ పెట్టారు.
ఇపుడు దానికి రెస్ట్ ఇచ్చేసి బాబు లిస్ట్ మీద పడ్డారు అని అంటున్నారు. పొత్తులు సీట్ల పంచాయతీ తెమిలితే మాత్రం కూటమి సగానికి పైగా సక్సెస్ సాధించినట్లే అంటున్నారు. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఆ ఇచ్చే సీట్లు కూడా జనసేనకు నచ్చే సీట్లు గెలిచే సీట్లు ఇస్తారా అన్నది రెండవ క్వశ్చన్.
దీంతో జనసేన టీడీపీలలో దీని మీదనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. జనసేన అరవై నుంచి మొదలెట్టి నలభైకి తెగ్గొట్టాలని చూస్తోందని టాక్. ఇక టీడీపీ ఇరవై నుంచి మొదలెట్టి లాస్ట్ గా ముప్పయ్కి తెగ్గొట్టాలని చూస్తోంది.
నిజానికి ముప్పయి సీట్లు అంటే టీడీపీ పొత్తుల హిస్టరీలో రేర్ రికార్డుగానే చూడాలి. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇంత నంబర్ ఒకే పార్టీకి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. దాంతో టీడీపీ ఇస్తున్నది బిగ్ నంబరే. ఇలా సీట్లు ఎక్కువగా ఇవ్వడం వల్ల టీడీపీకి ఇబ్బందిగానే ఉంటుంది.
అయినా సర్దుకుని పోవాలని క్యాడర్ కి చెబుతోంది. అయితే ఈ ముప్పయికి పది కలిపితేనే తమకు సమ్మతం అని జనసేన అంటుందా అన్నది ఇక్కడ మరో టెన్షన్. అలా కాకుండా ఈ సీట్లు తీసుకుని పోటీ చేస్తే మాత్రం పొత్తు పంచాయతీ ముగిసినట్లే. కానీ ఓట్ల బదిలీ ఎలా అవుతుంది అన్నది మాత్రం చెప్పలేరని తలపండిన చేగొండి హరిరామయ్య అంటున్నారు.
ఏది ఏమైనా ముప్పయి సీట్ల దాకా టీడీపీ వస్తే కనుక జనసేన విజయం ఈ విషయంలో సాధించినట్లే అంటున్నారు. మరి ఆ సీట్లలో అంతా తన పార్టీ వారిని జనసేన జెండా మోసిన వారిని తెచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటేనే ఆ పార్టీకి సార్ధకత అన్నదీ ఉంది. ఏది ఏమైనా ఫిబ్రవరి మొదటివారంలో ఈ పొత్తుల వ్యవహారం తేల్చేసి ఎవరెక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని ఆ మీదట అటు బాబు ఇటు పవన్ మేమూ సిద్ధం అంటూ జనంలోకి దూకుతారు అని అంటున్నారు. సో ఈ పొత్తులు సీట్ల వ్యవహారం ఇదంతా కూడా రాజకీయంగా వెరీ ఇంటరెస్టింగ్ మ్యాటరే అని అంటున్నారు.