ఆర్జీవీ అరెస్ట్...ఇదే నెక్స్ట్ టైటిల్

దాని అర్థం ఏంటి అంటే ఆయనకు కూడా తాను అరెస్ట్ కాక తప్పదని అర్థం అయిపోయింది అని అంటున్నారు.

Update: 2024-11-28 07:31 GMT

టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడిన ఆర్జీవీ అలియాస్ రామూ అలియాస్ రాం గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం అయిందా అంటే అవును అనే అంటున్నారు. ఆర్జీవీ సైతం లేటెస్ట్ గా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైలులో తనను పెడితే హాయిగా కొత్త సినిమా కధలు రాసుకుంటాను అని చెప్పారు. దాని అర్థం ఏంటి అంటే ఆయనకు కూడా తాను అరెస్ట్ కాక తప్పదని అర్థం అయిపోయింది అని అంటున్నారు.

దాంతో ఇక సోషల్ మీడియాలో కానీ యూ ట్యూబులలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ నెక్స్ట్ టైటిల్ ఏంటి అంటే ఆర్జీవీ అరెస్ట్ అన్నదే అని అంతా అంటున్నారు. ఇది పక్కా అని కూడా అంటున్నారు. తాను వర్తమానంలోనే జీవిస్తాను అని భవిష్యత్తు గురించి ఆలోచించను బెంగపడను ఫలితాలూ పర్యవసానాలు అసలు చూసుకోను అంటూ చెప్పే ఆర్జీవీకి భవిష్యత్తు మాత్రం అరెస్ట్ ఆ వెంటనే జైలు అని అంటున్నారు అంతా.

ఇదిలా ఉంటే ఆర్జీవీ అన్నీ వివాదాస్పద సినిమాలే తీస్తూ చాలా ఫ్యామస్ అయ్యారు అన్నది తెలిసిందే. ఇక వైఎస్ జగన్ సీఎం గా ఉన్నపుడు ఆర్జీవీ ఒక రేంజిలో చెలరేగిపోయారు అనే అంతా అంటారు. ఆయన చంద్రబాబు పవన్ లోకేష్ ల మీద తన ట్వీట్లు సినిమాలు యూట్యూబ్ షార్ట్ మూవీస్ ఇలా చాలానే తీశారు.

దాంతో ఆయా పార్టీలకు చెందిన వారు అంతా అప్పట్లో మండిపోయారు. అయితే ఎవరేమనుకున్నా అంతా నా ఇష్టం అన్నట్లుగానే ఆర్జీవీ వ్యవహరించారు. తనది రామూయిజమని అదే నిజమని కూడా ఆయన ప్రకటించుకునేవారు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇపుడు ఆర్జీవీ మీద కేసుల మీద కేసులు పడుతున్నాయి. ఆర్జీవీ పోలీసులకు దొరకాలే కానీ నేరుగా జైలుకే అని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే నిన్నటికి నిన్న ఒక యూ ట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో సైతం ఆర్జీవీ రెచ్చగొట్టే కామెంట్స్ అనేకం చేశారు. అంతే తప్ప తన మీద కేసుల గురించి ఆయన ఏ విధంగానూ ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదని అంటున్నారు. జైలుకు వెళ్తే ఏమవుతుంది అన్నట్లుగా లైట్ తీసుకుంటూ మాట్లాడరని అంటున్నారు. జైలుకు వెళ్తే ఏమవుతుంది రెండు మంచి సినిమా కధలు అక్కడ దొరుకుతాయని కూడా ఆర్జీవీ వెటకారంగా మాట్లాడారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్జీవీ అరెస్ట్ అయితేనే మంచిది అని మేధావులు కూడా అంటున్నారు. ఇక్కడ ఆర్జీవీ చేస్తున్న వాదనలు మనోభావాల మీద ఆయన వేస్తున్న సెటైర్లు కూడా వింతగా ఉంటున్నాయని అంటున్నారు. ఒక సామాజిక వర్గం మనోభావాలు దెబ్బ తింటాయని అన్నపుడు అలాంటి ప్రకటనలు చేసిన వారి మీద కోర్టులు చర్యలు తీసుకుంటాయి అని గుర్తు చేస్తున్నారు.

మనోభావాలు దెబ్బ తినడానికి బంధువులు చుట్టాలు లేదా దగ్గర వారు మాత్రమే అయి ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆర్జీవీ మాత్రం నేను బాబుని పవన్ ని అంటే జనాలకు ఏమిటి సంబంధం అని లాజిక్ లేని వాదనను వినిపిస్తున్నారు అని అంటున్నారు.

ఎవరి మనసులో ఎవరి మీద అభిమానం ఉంటుందో వారికి ఉండే మనోభావాలు దెబ్బ తిన్నపుడు వాటికి కారకులు అయిన వారి మీద చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుంది అన్నది అంతా ప్రశ్నిస్తున్నారు. ఇక రేపటి గురించి ఆలోచించను పర్యవసానాలు చూడను అని రియాల్టీలో జీవిస్తాను అని ఆర్జీవీ చేస్తున్న వాదన మీద కూడా కామెంట్స్ సెటైర్లు పడుతున్నాయి.

కారు డ్రైవ్ చేసుకుని వెళ్తున్నపుడు జోరుగా పోనిచ్చి ప్రమాదాన్ని ఎవరూ తెచ్చుకోరు కదా. అపుడు వారు చూసేది ఆలోచించేది జోరుగా కారు పోనిస్తే సంభవించే పరిణామాలు పర్యవసానాల మీదనే కదా అని ఆర్జీవీకి గుర్తు చేస్తున్నారు. ఏ విషయంలో అయినా పర్యవసానలు ఆలోచించకుండా తోచినదే చేస్తాను అన్నది సమాజంలో పరస్పరం ఇచ్చి పుచ్చుకుని జీవించే చోట కుదిరే వ్యవహారమేనా అంటున్నారు.

దీనికి మేధావి అయిన ఆర్జీవీయే జవాబు చెప్పాలని అంటున్నారు. ఏది ఏమైనా భావ ప్రకటన ఉంది అని ఇంతకాలం వాదిస్తూ వచ్చిన ఆర్జీవీ ఇపుడు అవతల వారి భావ ప్రకటన హక్కుని ఎలా కాదంటారు అని కూడా నిలదీస్తున్నారు. నీ వేలు ఎదుటి వారి ముక్కు దాకా రానంతవరకే దానికి స్వేచ్చ అన్నది ఆర్జీవీ లాంటి అతి తెలివైన వారు గుర్తించకపోవడం ఆయనకు ప్రస్తుతం వస్తున్న చిక్కులూ చికాకులు అని అంటున్నారు.

తాను ఎన్నికల ముందే మరిక రాజకీయ సినిమాలు తీయను అని చెప్పేసాను అంటున్న ఆర్జీవీ గతంలో తీసిన వాటికి ఇపుడు జవాబు చెప్పాల్సి ఉంటుంది కదా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మొత్తానికి ఆర్జీవీ అరెస్ట్ అన్నదే లేటెస్ట్ న్యూస్ అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News