బాబుకు ఇంటి భోజనం... ఈ రోజు గడిచేది ఇలానే!
దీంతో ఈ రోజు ఉదయం ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ ని జైలుకు పంపించారూ కుటుంబ సభ్యులు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆదివారం రాత్రి 1:20 నిమిషాలకు చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి జైల్ కు చేరుకుంది. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు కోసం జైల్లోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు అధికారులు. ఖైదీ నెంబర్ 7691 ను కేటాయించారు.
ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్ తెప్పించుకునేందుకు ఓ పిటిషన్.. జైలుకు కాకుండా హౌస్ అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో... ప్రస్తుతానికి ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్ తెప్పించుకునేందుకు కోర్ట్ అనుమతించింది. దీంతో ఈ రోజు ఉదయం ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ ని జైలుకు పంపించారూ కుటుంబ సభ్యులు.
ఇక అసాధారణ, అరుదైన పరిస్థితుల్లో మాత్రమే హౌస్ అరెస్ట్ ఉత్తర్వులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని తెలిపిన కోర్టు... ప్రస్తుతాన్నికి అలాంటి అసాధారణ, అరుదైన పరిస్థితులు ఏవీ లేవని అభిప్రాయపడింది. అంటే.. ఈ నెల 22 వరకూ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాకులోని ప్రత్యేక గదిలో ఉండాల్సిందే అని అంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ రోజు కుటుంబసభ్యులను కలుసుకోనున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా... ఇవాళ ముగ్గురు కుటుంబ సభ్యులు చంద్రబాబును కలవనున్నారు. చంద్రబాబును ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అంతకంటే ముందు చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్ ఎదురుగా ఉన్న జైలు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు ఏపీ బంద్ కు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్లు, పలు కూడళ్లలో ఆందోళనకు దిగుతున్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆందోళనకారులను పోలీసుల అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు.