బీజేపీలో బాబు మద్దతుదారులు.. కేంద్రంలో కదులుతున్న వ్యూహం ..!
కానీ, ఇది నిజమే. గతంలో చంద్రబాబు ఇచ్చిన అవకాశంతో రాజ్యసభకు వెళ్లిన వారు. గతంలో చంద్రబా బు చొరవతో ఏపీలో కాంట్రాక్టులు దక్కించుకున్నవారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్ని రంగాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆయన విజన్ నచ్చిన వారు కొందరు. ఆయన వెంట నడిచిన వారు మరికొందరు. ఆయన పాలనలో లబ్ధి పొందిన వారు ఇంకొందరు. మొత్తంగా.. చంద్రబాబు మద్దతుదారులు అక్కడ, ఇక్కడ అనే మాట లేకుండా.. అన్ని చోట్లా ఉన్నారు. అలానే కేంద్రంలోని బీజేపీ పెద్దల్లోనూ చంద్రబాబుకు మద్దతు దారులు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది.
కానీ, ఇది నిజమే. గతంలో చంద్రబాబు ఇచ్చిన అవకాశంతో రాజ్యసభకు వెళ్లిన వారు. గతంలో చంద్రబా బు చొరవతో ఏపీలో కాంట్రాక్టులు దక్కించుకున్నవారు. కేంద్రంలో పదవులు దక్కించుకున్న పాతతరం నాయకులు.. ఇలా అనేక మంది చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. ఉదాహరణకు కర్ణాటకలకు చెందిన సురేశ్ ప్రభు, తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్, మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీ సహా అనేక మంది ఉన్నారు.
వీరంతా.. బీజేపీ పార్టీలోనే ఉన్నప్పటికీ.. చంద్రబాబు విజన్, ఆయన పాలన అంటే.. ప్రాణం పెట్టేవారు. ఇక, ఆయన ఇచ్చిన రాజ్యసభ సీటుతోనే సురేష్ ప్రభు రైల్వే మంత్రి అయ్యారు. మొత్తంగా ఇదీ.. కేంద్రం లోని బీజేపీ నేతల పరిస్థితి!! అయితే.. వీరివల్ల ఏం జరుగుతుంది? అనేది ప్రశ్న. కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. ఏపీలో ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. టీడీపీతో కలిసి ఉంటే మేలు జరుగుతుందనే భావన ఈ నాయకుల కు కూడా ఉంది. గతంలో 2014 ఎన్నికల సమయంలో బీజేపీ-టీడీపీ కలిసిపోటీ చేసిన విషయం తెలిసిందే.
ఇలానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీతో కలిసి ఉంటే బాగుంటుందని.. కొందరు నాయకులు కోరుతున్నారు. ఇలాంటి వారిలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉండడం.. ఆశ్చర్యానికి దారితీస్తోంది. తాజాగా డిల్లీలో పర్యటించిన నారా లోకేష్.. అత్యంత రహస్యంగా బీజేపీ పెద్దలతోనూ భేటీ అయినట్టు సమాచారం. వారి పిలుపు మేరకు ఆయన కలుసుకున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో తమ సానుభూతిని వ్యక్తం చేయడంతోపాటు పొత్తులపైనా కొంత మాట్లాడినట్టు సమాచారం. మొత్తానికి బీజేపీలో కదలిక అయితే వచ్చింది.