సేమ్ తప్పు మళ్లీ రిపీట్.. అప్పుడు ఒడిశా.. ఇప్పుడు తమిళనాడు

ఒడిశా రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం తెలిసిందే.

Update: 2024-10-12 04:09 GMT

ఒకే ట్రాక్ మీద రెండు రైళ్లు ఢీ కొనే ప్రమాదాన్ని తగ్గించేందుకు వీలుగా డెవలప్ చేసిన టెక్నాలజీ ‘కవచ్’. భారత రైల్వేల్లో ఈ సాంకేతితకను ఉపయోగిస్తున్నట్లుగా రైల్వే శాఖ తరచూ చెప్పుకుంటూ ఉంటుంది. అలాంటి సాంకేతికత అందుబాటులో ఉన్న వేళలో భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం ఎలా జరుగుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.అదే సమయంలో గత ఏడాది ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం కూడా ఇదే తరహాలో ఉన్న విసయాన్ని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

ఒడిశా రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం తెలిసిందే. అప్పట్లో గ్రీన్ సిగ్నల్స్ పడటం.. రైలు ట్రాక్ మారటం లాంటి తప్పిదాలు జరిగినట్లుగా గుర్తించారు. సరిగ్గా అలాంటి తీరులోనే తాజా భాగమతి ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురి కావటం విస్మయానికి గురి చేస్తోంది. శుక్రవారం రాత్రి 8.27 గంటల వేళలో జరిగిన ఈ ప్రమాదంలో అండర్ లైన్ చేసుుకోవాల్సిన అంశం ఒకటి ఉంది.

భాగమతి రైలు పొన్నేరి స్టేషన్ దాటి.. కవరైపెట్టై స్టేషన్ కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైను నుంచి కాకుండా లూప్ లైన్ లోకి వెళ్లటం.. ఆ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొనటం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ టైంలో భాగమతి రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గూడ్సు రైలును వేగంగా వచ్చిన భాగమతి ట్రైన్ ఢీ కొనటంతో ఇంజిన్ తో పాటు దాదాపు 12 - 13 కోచ్ లు పట్టాలు తప్పితే.. అందులో ఇంజిన్ తర్వాత లగేజ్ కోచ లతో పాటు 10 ఏసీ కోచ్ లే ఉన్నాయి. పార్శిల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి.

ఒకవేళ.. ఇంజిన్ తర్వాత ప్రయాణికులు ఉన్న బోగీ ఉంటే.. దారుణమే చోటు చేసుకొని ఉండేది. పార్శిల్ బోగీ ఉండటంతో ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గిందని చెప్పాలి. ఓవైపు కవచ్ టెక్నాలజీ.. మరోవైపు ప్రధాన లైన్ మీద కాకుండా లూప్ లైన్ లోకి రైలు ఎందుకు వెళ్లింది? దానికి కారణమేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గత ఏడాది ఒడిశా రైలు ప్రమాదాన్ని చూస్తే.. వేగంగా ప్రయాణిస్తున్న రైలు బోగీలు ఢీ కొనటంతో పాటు.. ప్రయాణికులు ఉన్న బోగీలు తొలుత ఢీ కొనటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు.. వందలాది మంది ప్రయాణికులు ప్రాణాల్ని కోల్పోయారని చెప్పాలి.

Tags:    

Similar News