బాలినేని ఆ ట్వీట్ వెనక మర్మమేంటి ?!

వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన లోకి జంప్ అవుతున్నారా ? దీనికి సంబంధించి అంతర్గత చర్చలు నడుస్తున్నాయా

Update: 2024-06-08 02:45 GMT

వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన లోకి జంప్ అవుతున్నారా ? దీనికి సంబంధించి అంతర్గత చర్చలు నడుస్తున్నాయా ? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. దీనికి సంబంధించి బాలినేని చేసిన ఒక ట్వీట్ దీనికి ఆజ్యం పోస్తుంది.

‘అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హార్షణీయం. శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎటువంటి హింసాత్మాక ఘటనలకు తావులేదు. అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నముగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూలేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మాక ఘటనలు, అక్రమ కేసులు , భౌతిక దాడులు, మా అనుచరులపై వేధింపులపై మీరు స్పందించాలని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు’ అంటూ బాలినేని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడమే ఈ వాదనకు కారణం.

వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న బాలినేనికి రెండోసారి విస్తరణలో మంత్రిపదవి దక్కలేదు. అప్పటి నుంచి ఆయన కాస్త అసంతృప్తిగానే ఉన్నాడు. వైవీ సుబ్బారెడ్డి బాలినేని మధ్యన ఉన్న విభేదాలున్నాయి.

ఇక ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దని మాగుంట శ్రీనివాసరెడ్డికే టికెట్ ఇవ్వాలని బాలినేని వాదించినా జగన్ పట్టించుకోలేదు. శాసనసభ స్థానాలలోనూ జగన్ పట్టించుకోలేదన్న అసంతృప్తి బాలినేనికి ఉంది.

ఇక పవన్ - బాలినేని మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా బాలినేనికి చాలా మంది నిర్మాతలతో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య పవన్ కల్యాణ్ సినిమాకు కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో జనసేనలోకి వెళితే తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి రాజకీయ భవితవ్యం ఉంటుందని బాలినేని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల విషయంలో బాలినేని ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Tags:    

Similar News