ఫేక్ ట్వీట్ ఇష్యూపై స్పందించిన బండ్ల గణేష్!
ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ అకౌట్స్ ఏవో, ఒరిజినల్ అకౌంట్స్ ఏవో తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది.
ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ అకౌట్స్ ఏవో, ఒరిజినల్ అకౌంట్స్ ఏవో తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే... ఎలాన్ మస్క్ కొత్త నిబంధనలతో ఒరిజినల్ అకౌంట్స్ ని గుర్తించడం చాలా సులువు! అయినప్పటికీ ఇప్పటికీ కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, సేం పిక్ పెట్టి ట్వీట్స్ పెడుతుంటారు. ఈ సమయంలో బండ్ల గణేష్ (గణేష్ బండ్ల) పేరుమీద ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే దానిపై తాజాగా ఒరిజినల్ బండ్ల గణేష్ స్పందించారు!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన దగ్గర నుంచి వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా, అసెంబ్లీ వేదికగా, మీడియా ముందు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయవర్గాల్లో పెను దుమారం లేపింది.
అవును... "హలో.. లోకేష్ గారు! తమరి లొకేషన్ ఎక్కడా?" అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీనికి రకరకాల రిప్లైలు, కామెంట్లూ వస్తున్నాయి. ఈ సమయంలో సినీ నిర్మాత, నటుడు గణేష్ బండ్ల పేరు మీద ఓ ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ హల్ చల్ చేస్తోంది. అసభ్య పదజాలం ధ్వనించేలా గణేష్ బండ్ల రిప్లై ఇచ్చినట్లుగా ట్వీట్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ పై బండ్ల గణేష్ స్పందించారు.
ఆ ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ని పంచుకుంటూ... ఆ ట్విట్టర్ అకౌంట్ తనది కాదంటూ మంత్రి అంబటి రాంబాబుకు రిప్లై ఇచ్చారు. ఇదే సమయంలో తన పేరుతో నకిలీ ట్వీట్ లను పోస్ట్ చేసి తనను ఇబ్బంది పెట్టవద్దని నెటిజన్ లను అభ్యర్థించాడు. దీంతో ఈ రిప్లై పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా గతకొన్ని రోజులుగా నారా లోకేష్.. ఢిల్లీలో ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడ టీడీపీ ఎంపీలను కలుస్తున్నట్లు ఫోటోలు విడుదలవుతున్నాయి. మరోపక్క సుప్రీంకోర్టు న్యాయవాదులతో క్వాష్ పిటిషన్ పై తీవ్ర చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.