బ్యాంక్ ఆఫ్ అమెరికా కస్టమర్ల బ్యాలెన్స్ జీరోగా మారింది... ఏమైంది?

అవును... వేలాది మంది బ్యాంక్ ఆఫ్ అమెరికా కస్టమర్ల ఖాతాలు జీరో అయ్యాయి. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలు చెందారని తెలుస్తోంది

Update: 2024-10-03 04:43 GMT

సాధారణంగా ఓ వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ లాగిన్ అయ్యి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు సడన్ గా అది 'సున్నా" గా చూపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? క్లియర్ చేయ్యాల్సిన లోన్ అమౌంట్ మాత్రం కరెక్ట్ గా చూపిస్తూ.. ఉన్న బ్యాలెన్స్ మొత్తం జీరో అయినట్లు చూపిస్తే పరిస్థితి ఎమిటి? ఈ పరిస్థితిని బ్యాంక్ ఆఫ్ అమెరికా కస్టమర్లు ఎదుర్కొన్నారు.

అవును... వేలాది మంది బ్యాంక్ ఆఫ్ అమెరికా కస్టమర్ల ఖాతాలు జీరో అయ్యాయి. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలు చెందారని తెలుస్తోంది. తమ తమ ఖాతాల్లో లాగిన్ ఐనప్పుడు బ్యాలెన్స్ జీరో అని చూపించడంతో వారంతా సోషల్ మీడియా వేదికగా తమ సమస్యపై ఫిర్యాదు చేశారు. టెంపరరీ టెక్నికల్ ఇష్యూనే దీనికి కారణం అని అంటున్నారు.

ఇంటర్నేషనల్ మీడియా నివేదికల ప్రకారం... బుదవారం మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో చాలా మంది కస్టమర్లు తమ తమ బ్యాంక్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ జీరో ఉన్నట్లు నివేదించారు. మరికొంతమంది అస్సలు లాగిన్ చేయలేకపోయారు. ఇలా తమ అకౌంట్లను యాక్సెస్ చెయలేకపోవడం, లాగిన్ అయితే జీరో బ్యాలెన్స్ చూపించే ఎర్రర్ ను నివేదించడానికి సోషల్ మీడియాను ఆశ్రయించారు.

ఈ సమయంలో సుమారు 17,000 మంది కస్టమర్లు ఇప్పటికీ బగ్ తో ఎఫెక్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఎక్స్ వేదికగా పోస్టులు హల్ చల్ చేశాయి. ఇలా కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా టెక్నికల్ ఇష్యూని పరిష్కరించిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా విషయాన్ని కస్టమర్లతో పంచుకుంది.

ఇందులో భాగంగా... కొంతమంది కస్టమర్ల ఖాతా, బ్యాలెన్స్ యాక్సెస్ తో సమస్యలను ఎదుర్కొంటున్నారని.. ఐతే ఇవి చాలా వరకూ పరిష్కరించబడ్డాయని బ్యాంక్ తెలిపింది. మరోపక్క ఇప్పటికీ కొంతమంది తమ ఖాతాలను యాక్సెస్ చెయలేకపోతున్నారని అంటున్నారు. మరికొంతమంది మాత్రం... బ్యాలెన్స్ జీరో చూపిస్తూ.. లోన్ సమాచారం మాత్రం సరిగ్గానే చూపించిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News