రైట్ .. రైట్ : రూ.12.50 లక్షల కోట్లు రైటాఫ్

రుణాలు చెల్లించాలని సామాన్యులను పీడించే బ్యాంకులు కార్పోరేట్లకు ఇచ్చిన లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ ల పేరుతో రద్దు చేస్తున్నాయి.

Update: 2024-05-16 16:30 GMT

నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్‌ చేసిన రుణాల విలువ ఎంతో తెలుసా ? దాదాపు రూ.12.50 లక్షల కోట్లు. 2014-15 నుంచి 2018-19 వరకు ఐదేండ్ల కాలంలో రూ.6,24,370 కోట్ల రుణాలను రైటాఫ్‌ చేసిన ప్రభుత్వ బ్యాంకులు.. 2019-20 నుంచి 2023-24 మధ్యన మరో రూ.6,14,443 కోట్ల రుణాలను రైటాఫ్‌ చేశాయి. ఇవన్నీ కార్పోరేట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ వివరాలు కేంద్ర ఆర్థికశాఖ పార్లమెంటులో వెల్లడించడం విశేషం.

రుణాలు చెల్లించాలని సామాన్యులను పీడించే బ్యాంకులు కార్పోరేట్లకు ఇచ్చిన లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ ల పేరుతో రద్దు చేస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఈ విషయంలో కార్పోరేట్లకు, బ్యాంకు నిర్ణయాలకు మద్దతు పలుకుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్ లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికికే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2004-05 నుంచి 2013-14 మధ్య పదేండ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.2,20,328 కోట్ల బకాయిలను రైటాఫ్‌ చేయగా అందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.1,58,994 కోట్లు.

2014-15 నుంచి 2023-24 మధ్య పదేండ్ల బీజేపీ పాలనలో దాదాపు రూ.16 లక్షల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్‌ చేయగా ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.12,38,813 కోట్లు కావడం గమనార్హం.

Tags:    

Similar News