యూట్యూబర్ పై బర్రెలక్క ఫైర్… వీడియో వైరల్!

అవును... ఎన్నికల ప్రచార సమయంలో బర్రెలక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Update: 2024-02-01 11:42 GMT

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా... తెలంగాణ రాజకీయాల్లో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఫుల్ ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు విద్యావంతులు, మేధావులూ ఆమె రాకను స్వాగతించారు. యువత రాజకీయాల్లోకి రావడం శుభసూచినమని.. ఆమెకు పడిన ఓట్లే మార్పుకు నాంధి అని తెలిపారు. ఈ ఉత్సాహంతో... ఆమె సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీచేసే అవకాశాలున్నాయని కథనాలొస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతకను అంటూ కొల్లాపూర్ నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క... ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో యువత, పలువురు మేధావులను ఆకర్షించగలిగారు. దీంతో వారంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒకసమయంలో... బర్రెలక్క విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు.

గడిచిన శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన ఆమెకు కేవలం 5వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో... డిపాజిట్ కోల్పోయారు బర్రెలక్క. ఈ సమయంలో... తనకు తక్కువ ఓట్లు రావటానికి ఓ యూట్యూబర్ కారణమంటూ బర్రెలక్క రెచ్చిపోయారు. ఈ సందర్భంగా... సదరు యూట్యూబర్ స్టూడియోకు వెళ్లిన బర్రెలక్క అతడిపై ఫైరవుతూ ఫుల్ హల్ చల్ చేశారు. ఒకానొకసమయంలో కట్రోల్ తప్పారో ఏమో కానీ.. ఏకంగా సదరు యూట్యూబర్ చెంప చెళ్లుమనిపించారు కూడా!

అవును... ఎన్నికల ప్రచార సమయంలో బర్రెలక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ప్రధానంగా ఆమె పెళ్లి, ఆ తర్వాత జరిగిన పరిణమాలను ఆమె తండ్రి ఓ యూట్యూబ్ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆమెపై నెగిటివ్‌ గా ప్రచారం చేశారు కొంతమంది నెటిజన్లు. అయితే... తనకు తక్కువ ఓట్లు రావడానికి ఆ వీడియో కారణం అనేది ఆమె ఆరోపణ.

దీంతో... ఇప్పటికి ఆ యూట్యూబర్ ఆచూకీ దొరికిందో ఏమో కానీ... అతడి స్టూడియోకు వెళ్లిన బర్రెలక్క.. ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గట్టిగా అరుస్తూ.. ఏడుస్తూ.. అతడిపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు!! దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బర్రెలక్క కు ఆగ్రహం వస్తే ఈ రేంజ్ లో ఉంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు!



Tags:    

Similar News