బీసీ సాయమంతేనా ?

తెలంగాణాలో వెనకబడిన కులాల యువతకు స్వయం ఉపాధి కోసం కల్పించిన బీసీ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీమ్ అతిగతి లేకుండా పోయింది.

Update: 2023-10-03 17:30 GMT

తెలంగాణాలో వెనకబడిన కులాల యువతకు స్వయం ఉపాధి కోసం కల్పించిన బీసీ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీమ్ అతిగతి లేకుండా పోయింది. సెకండ్ టర్మ్ లో ఈ పథకానికి అసలు ప్రభుత్వం నిధులే కేటాయించలేదని తెలుస్తోంది. గడచిన తొమ్మిదేళ్ళలో ఈ పథకానికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు మూడు సార్లే. నిధులు విడుదల చేయడానికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లో కడా నిధులు లేవు. కార్పొరేషన్ ద్వారా 41 వేల మందికి అందింది కేవలం రు. 231 కోట్లు మాత్రమే.

బీసీలకు ఉద్దేశించిన చేయూత పథకం కాగితాలకే పరిమితం కాగా ఆత్మగౌరవ భవనాల పురోగతి కూడా అంతంతమాత్రంగానే ఉండిపోయింది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలే ఉన్నారని ఒకపుడు కేసీయార్ ఎంతో గొప్పగా చెప్పారు. ఆ సగం జనాభా కోసమే ఈ స్కీమును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించి తర్వాత అతిగతీ లేకుండా చేసేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ ఓట్ల కోసం చేయూత పథకాన్ని ప్రకటించారు.

2018-19 ఆర్ధిక సంవత్సరం నుండి ఇప్పటివరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ప్రభుత్వం నుండి నిధులు విడుదలే కాలేదు. బీసీ కార్పొరేషన్ను ఏర్పాటుచేసిన సమయంలో రు. వెయ్యి కోట్లు కేటాయించబోతున్నట్లు కేసీయార్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఉత్త ప్రకటనగానే మిగిలిపోయింది. కార్పొరేషన్ కు పాలకవర్గాన్ని నియమించి కాలపరిమితి కూడా అయిపోయింది. అయినా నిదులు లేకుండానే పాత పాలకవర్గం అలాగే కంటిన్యు అవుతోంది.

షెడ్యూల్ ఎన్నికలేమో ముంచుకొచ్చేస్తోంది. ఇచ్చిన హామీలు అమలుచేయటానికి ప్రభుత్వం దగ్గర అవసరమైన నిధులు లేవు. దాంతో ఏమిచేయాలో మంత్రులు, ఎంఎల్ఏలు, ఉన్నతాదికారులకు దిక్కుతోచటంలేదు. కేసీయార్ ను కలిసే అవకాశం ఎవరికీ దక్కదు కాబట్టి నేరుగా ముఖ్యమంత్రిని నిధుల గురించి అడిగే అవకాశం ఎవరికీ ఉండదు. జనాలందరికీ అందుబాటులో ఉండేది మంత్రులు, ఎంఎల్ఏలే కాబట్టి సాయం కోసం జనాలందరు వాయించేస్తున్నారు. మొత్తానికి కేసీయార్ ప్రకటించిన చాలా సాయాల్లాగే బీసీ చేయూత పథకం కూడా అలాగే తయారైంది. మరి చివరకు ఎన్నికల సమయంలో ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News