బాబుకు దీపావళి పండుగ ముందు...ఆ తరువాత క్వాష్ తీర్పు

దీపావళి పండుగ ఆనందం చంద్రబాబుకు ఈసారికి ఎక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వినాయకచవితి, విజయదశమి పండుగలు రెండూ రాజమండ్రి జైలులోనే జరుపుకున్నారు.

Update: 2023-11-09 10:20 GMT

దీపావళి పండుగ ఆనందం చంద్రబాబుకు ఈసారికి ఎక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వినాయకచవితి, విజయదశమి పండుగలు రెండూ రాజమండ్రి జైలులోనే జరుపుకున్నారు. ఆయనకు 28 రోజుల మధ్యంతర బెయిల్ ని హై కోర్టు మంజూరు చేసింది.

ఈ నేపధ్యంలో చంద్రబాబు ఇంట్లోనే ఉంటున్నారు. ఇటీవలనే ఆయన కంటికి ఆపరేషన్ కూడా జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు ఈ నెల 12న దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలసి హ్యాపీ మూడ్ లో చేసుకోనున్నారు.

ఈ రోజు సుప్రీం కోర్టు బాబు కేసుల విషయంలో కీలకమైన నిర్ణయాలు వెలువరించింది. ఫైబర్ నెట్ కేసులో బాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణను నవంబర్ 30కి సుప్రీం కోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటివరకూ చంద్రబాబుని ఈ కేసులో అరెస్ట్ చేయవద్దు అని కోర్టు సీఐడీని ఆదేశించింది.

సో ఆ విధంగా చూస్తే బాబుకు ఈ కేసులో కొంత ఊరట దక్కినట్లే. ఇక బాబుతో పాటు అంతా ఎదురుచూస్తున్న కేసు అత్యంత కీలకమైనది అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ మీద వాదనలు అటూ ఇటూ వాడిగా వేడిగా సాగాయి.

దీని మీద తీర్పుని సుప్రీం కోర్టు రిజర్వ్ చేసి ఉంచింది. దానికి ఈ రోజు వెలువరిస్తుంది అని అంతా అనుకున్నారు. అయితే సుప్రీం కోర్టు ధర్మాసనం మాత్రం ఈ కేసు విషయంలో తీర్పుని దీపావళి సెలవులు తరువాత వెలువరిస్తామని పేర్కొంది. అంటే ఈ నెల 13న దీపావళి సెలవు ఉంది.

ఇక క్వాష్ పిటిషన్ పైన ఈ నెల 23లోగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ జరుపుతామని సుప్రీం తెలిపింది. అలా చూసుకున్నట్లు అయితే ప్రస్తుతానికి బాబుకు ఈ కేసు విషయంలో తాత్కాలిక ఊరట లభించింది అనుకోవాలి.

ఈ కేసు విషయంలో బాబు పెట్టుకున్న క్వాష్ పిటిషన్ మీద ఏ రకమైన తీర్పు వస్తుందో చూడాలి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే బాబుకు ఇబ్బందులు మొత్తం ఉన్నట్లే. అలా కాకుండా క్వాష్ పిటిషన్ మీద సానుకూల తీర్పు వస్తే మాత్రం బాబు మీద ఒక్క కేసు కూడా ఉండదు. ఆయన హ్యాపీగా బయటకు వచ్చేసినట్లే అనుకోవాలి. ఏది ఏమైనా దీపావళి వరకూ బాబు ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉండొచ్చు.

Tags:    

Similar News