"గే" గా మారిన టెక్కి... చిత్రహింసలంటూ భార్య ఫిర్యాదు!

అవును... తన భర్త స్వలింగ సంపర్కుడిగా మారాడని.. పురుషులతో సంబంధాలు పెట్టుకున్నాడని..

Update: 2023-08-17 08:27 GMT

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన వివాహితుడైన వ్యక్తి.. ఇతర పురుషులతో సంబంధం పెట్టుకున్నాడు. గే గా మారాడు! ఆ సమయంలో ఇంటిలో ఉన్న భార్యను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ చిత్రహింసలు భరించలేని భార్య తాజాగా పోలీసులను ఆశ్రయించింది.

అవును... తన భర్త స్వలింగ సంపర్కుడిగా మారాడని.. పురుషులతో సంబంధాలు పెట్టుకున్నాడని.. దీంతో తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ పై అతని భార్య ఫిర్యాదు చేసింది. బెంగళూరులోని జ్ఞానభారతి పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... ఎంబీఏ పూర్తి చేసిన బెంగళూరులోని ఓ ప్రముఖ టెక్‌ కంపెనీలో పనిచేస్తోన్న మహిళకు... 2020లో వివాహమైంది. అయితే వివాహం అనంతరం ఉద్యోగం వదిలేయాలని భర్త, అతని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఆమె అందుకు అంగీకరించింది.

ఈ సమయంలో పెళ్లయిన ఏడాది తర్వాత బిడ్డ పుట్టడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పిల్లల గురించి ఆమెను ప్రశ్నించారు. ఇదే సమయంలో ఈ విషయంపై ఈ మహిళ తన భర్తను ఎన్నో సార్లు ప్రశ్నించగా... కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

దీంతో అతను ఐవీఎఫ్ చికిత్సను ఎంచుకోవాలని ఆమె కోరింది. అయినప్పటికీ అతడు అంగీకరించలేదు. తనకు దూరంగా ఉంటూ.. పిల్లల ప్రస్థావన తెస్తే దూరం దాటవేస్తోన్న భర్య ధోరణిపై ఆమె అనుమానపడింది. అనంతరం అతడి ఫోన్‌ ను పరిశీలించింది.

ఆ ఫోన్ లో తన భర్త ఇతర పురుషులతో శృంగారంలో ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో షాకైన ఆ మహిళ... ఈ విషయంపై భర్తను నిలదీసింది. అక్కడనుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించింది.

ఈ సమయంలో భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ సమయంలో నిందితుడు ఆమెకు పదే పదే మెసేజ్‌ లు పంపడం, కాల్స్ చేయడం ప్రారంభించాడని.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడనని వేడుకున్నాడట. ఇదే సమయలో తన వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడట.

ఈ సమయంలో వీరిమధ్య ఉన్న వివాదం పరిష్కరించడానికి రెండు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నించారట. అయినప్పటికీ వ్యవహారం కొలిక్కి రాలేదంట. దీంతో టెక్కీ, అతని తల్లిదండ్రులపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Tags:    

Similar News