వైసీపీ మీద బెట్టింగ్ ఎక్కువైందా?
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎనికల పోలింగ్ ముగిసినప్పటి నుంచీ అధికారంలోకి రాబోయే పార్టీపై రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎనికల పోలింగ్ ముగిసినప్పటి నుంచీ అధికారంలోకి రాబోయే పార్టీపై రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అనూహ్యంగా ఒక అంశాన్ని ఒక వర్గం మీడియా జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. పోలింగ్ భారీగా నమోదైంది కాబట్టి అది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే.. అందువల్ల అధికారం కూటమిదే.. చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయంటూ బలంగా ప్రచారం తెరపైకి తెచ్చింది!
దీంతో... ఒక వర్గం ప్రజానికం ఈ విషయాలను బలంగా నమ్మిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... బెట్టింగ్ రాయుళ్లు బరిలోకి దిగారు. ఈ క్రమంలో గురువారం వరకూ టీడీపీ మీద 1:1.5 బెట్టింగ్ జరిగిన పరిస్థితి. పెరిగిన పోలింగ్ కారణాన్ని చూపెడుతూ కూటమి గెలుపును కన్ఫాం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కావాలనే ఈ తరహా ప్రచారం చేస్తున్నారనే చర్చా తెరపైకి వచ్చింది.
కట్ చేస్తే... గురువారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని తెలుస్తుంది. ఐప్యాక్ టీం ని కలిసిన తర్వాత జగన్ పూర్తి ధీమాగా చెప్పడమో.. లేక, టీడీపీ అధినేత మహానాడుని వాయిదా వేయడమో.. కారణం ఏదైనప్పటికీ గత 24 గంటల నుంచి వైసీపీ అధికారంలోకి రాబోతుందంటూ బెట్టింగ్ పెట్టేవాళ్లు ఎక్కువైపోయారని అంటున్నారు.
అవును... ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ ముగిసినప్పటినుంచీ కూటమి గెలుస్తుందంటూ బెట్టింగ్ ఎక్కువగా సాగగా.. గత 24 గంటల నుంచి వేవ్ మొత్తం మారిందని అంటున్నారు. “గతంలో లగడపాటి మాటలు నమ్మి మునిగిపోయాము.. ఈసారి ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే మాటలూ నమ్మి మరోసారి మోసపోలేము” అనే కనువిప్పు బెట్టింగ్ రాయుళ్లలో కలిగిందని చెబుతున్నారు.
పైగా పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పలేమని.. పథకాలు పోకూడదంటే జగన్ నే గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో అది ప్రభుత్వ అనుకూల ఓటు కూడా అయ్యి ఉండొచ్చని భావించారని చెబుతున్నారు. ప్రధానంగా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, సంక్షేమ పథకాలు తీసుకున్న మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కు హాజరవ్వడం అనేది ప్రో గవర్నమెంట్ ఓటింగ్ అని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
ఇదే సమయంలో... లోకల్ సర్వేలు అన్నీ వైసీపీ అనుకూలంగా చూపిస్తున్నాయని.. ఇదే సమయంలో కొన్ని జాతీయ సర్వేలు కొన్ని మాత్రమే కూటమికి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రీస్టియన్స్ లో సుమారు 90% వైసీపీకి వేశారని.. బీసీలు కూడా 50 శాతం, కాపు మహిళలు 50 - 60 శాతం జగన్ కి జైకొట్టిన పరిస్థితి అనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
కూటమి గెలిస్తే ఇప్పుడు కరెక్ట్ గా అందుతున్న పథకాలు ఆగిపోతాయని.. పైగా అంతగా జగన్ పై వ్యతిరేకత రావడానికి గల కారణాలు కూడా లేవని.. కోవిడ్ లాంటి కారణం దొరికినా ప్రజలకు పథకాలు ఆగకుండా అందించారని ప్రజల్లో విశ్వాసం బలంగా ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. జగన్ కంటే ఎక్కువ పథకాలే ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత టెరమ్స్ & కండిషన్స్ చాలా ఉంటాయని, నమ్మే పరిస్థితి లేదని భావించారని చెబుతున్నారు.
పైగా వైఎస్ జగన్ పై ఒక వర్గం మీడియాలోనూ, టీడీపీ నేతలు చెబుతున్న మాటల్లో మాత్రమే వ్యతిరేకత కనిపిస్తుందని.. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం వీరు చెబుతున్నంతగా, ప్రచారం చేస్తున్నంతగా అయితే వ్యతిరేకత లేదని అంటున్నారు. దీంతో... మరోసారి ఏపీలో ఫ్యాన్ గుక్కపట్టి తిరగడం కన్ఫాం అనే చర్చ ఒక్కసారిగా మొదలవ్వడంతో.. బెట్టింగ్ రాయుళ్ల ఆలోచనా సరళి కూడా మారిందని.. ఫలితంగా వైసీపీ గెలుస్తుందంటూ బెట్టింగ్ చేసేవారి సంఖ్య బాగా పెరుగుతుందని చెబుతున్నారు.