సంచలనంగా మారిన ఆ సీఎం వ్యాఖ్యలు.. ఏడాదిలో మధ్యంతరం?

తాజాగా ఆయన పాల్గొన్న బహిరంగ సభను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-08 05:30 GMT

సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడై.. కొత్త సర్కారు ఇంకా కొలువు తీరింది లేదు. అప్పుడే.. ఆ ప్రభుత్వం పడిపోవటం.. మధ్యంతరం ఎన్నికలకు తెర తీస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలకు లాజిక్ చెప్పలేదు కానీ.. ఆయన మాత్రం నమ్మకంగా మధ్యంతరం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన పాల్గొన్న బహిరంగ సభను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని.. ఆర్నెల్ల నుంచి ఏడాది లోపు దేశంలో మధ్యంతర ఎన్నికలు రానున్నట్లు చెప్పారు. ‘‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లను పక్కన పెడుతున్నారు. యోగి కుర్చీ కదులుతోంది’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజుకు మూడు డ్రెస్సులు మార్చే వారు (మోడీ పేరును నేరుగా ప్రస్తావించకుండా) ఇప్పుడు ఒకే డ్రెస్ లతో మూడు కార్యక్రమాలకు హాజరవుతున్నారన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పారన్న ఆయన.. ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రులను జైల్లో పెట్టటంపై బీజేపీకి ఈ ఎన్నికల్లో బాగా బుద్ధి చెప్పారన్నారు. ఇకపై వాళ్లు ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఏం ధరిస్తున్నారు? లాంటి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న మాజీ సీఎం వ్యాఖ్యలన్ని కూడా ఎన్డీయే పక్ష నేతగా మోడీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్న రోజునే వ్యాఖ్యానించటం గమనార్హం.

Tags:    

Similar News