ఇంతపెద్ద అపార్ట్మెంట్ ఎప్పుడైనా చూశారా?... వీడియో వైరల్!

ఇక ఈ భారీ అపార్ట్ మెంట్ లో అద్దెల విషయానికొస్తే... విస్తీర్ణాన్ని బట్టి రూ.18 వేల నుంచి మొదలై రూ.50 వేల వరకూ అద్దె ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Update: 2024-10-07 04:01 GMT

సాధారణంగా అపార్ట్ మెంట్స్, గేటెడ్ కమ్యునిటీస్ అంటే ఎంత పెద్దగా ఉంటాయి.. అక్కడ ఎన్నేసి కుటుంబాలు లేదా ఎంతమంది జనాభా నివసిస్తుంటారనేది చాలా అమందికి అవగాహన ఉన్న విషయమే. అయితే.. వందల్లో కాదు, 20వేల మంది నివశిస్తూ.. మరో 10వేళ మంది నివసించడానికి ఏర్పాట్లు చేస్తున్న అపార్ట్ మెంట్ చైనాలో ఉంది.

అవును... 30 అంతస్తులు, 675 అడుగుల ఎతు, 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం, గరిష్టంగా 30వేల మండి నివసించేందుకు వీలుగా "ఎస్" అకారంలో నిర్మించబడిన ఓ కట్టడం చైనాలో ని కియాన్ జియాంగ్ సెంచురీ నగరంలో ఉంది. "రీజెంట్ ఇంటర్నేషనల్" అనే ఈ అపార్ట్ మెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్ మెంట్ గా నిలిచింది.

ఇప్పటికే 20 వేల మంది నివాసం ఉంటున్న ఈ భారీ అపార్ట్ మెంట్ లో మరో 10 వేల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇక్కడ ఉన్న సదుపాయాలు అన్నీ ఇన్నీ కాదు. ఇంత భారీ నివాసంలో ఉండేవారు ఎలాంటి అవసరం వచ్చినా క్యాంపస్ దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు.

రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎంటర్ టైన్ మెంట్ ఆప్షన్స్.. ఇలా అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి! వీటితో పాటు ఫిట్ నెస్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, సెల్యూన్స్.. వాట్ నాట్? అన్నీ ఇక్కడే అందుబాటులో ఉండటం విశేషం. ఇదే సమయంలో ఆహ్లాదకరమైన పార్కుల సౌకర్యం కూడా ఇక్కడ ఉంది!

ఇక ఈ భారీ అపార్ట్ మెంట్ లో అద్దెల విషయానికొస్తే... విస్తీర్ణాన్ని బట్టి రూ.18 వేల నుంచి మొదలై రూ.50 వేల వరకూ అద్దె ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. వాస్తవానికి ఈ అపార్ట్ మెంట్ 2013లోనే ప్రారంభమైనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిర్మాణం అద్భుతమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

Tags:    

Similar News