ఖాకీలను కలవరపెట్టిన పక్షి

పక్షి జాతుల్లో కొన్ని మాత్రమే మనుషుల్లా మిమిక్రీ చేయగలవట. ఈ అరుదయిన పక్షి శబ్దాలతో ముందు కంగారుపడిన పోలీసులు,

Update: 2024-04-14 15:30 GMT

రామచిలుక, కోకిల, నెమలి, కాకి వంటి పక్షుల అరుపులు మనకు తరచుగా వింటుంటాం. కానీ యూకేలోని థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కన ఒక పక్షి చేస్తున్న అరుపులు పోలీసులను తికమక పెడుతుండగా సాధారణ పౌరులకు దడపుట్టిస్తుంది.

ఇంతకూ ఆ పక్షి ఏం చేస్తుందని ఆలోచిస్తున్నారా ? అచ్చం పోలీస్ సైరన్ మాదిరిగా అరుస్తుందట. దీంతో ఆ సౌండ్ వినగానే స్టార్ట్ చేయకుండానే ఈ సౌండ్ ఏంటని పోలీసులు తమ వాహనాల వద్దకు పరుగులు పెడితే .. రోడ్డు మీద వెళ్తున్న జనాలు పోలీసులు వస్తున్నారని అలర్ట్ అవుతున్నారట.

పక్షి జాతుల్లో కొన్ని మాత్రమే మనుషుల్లా మిమిక్రీ చేయగలవట. ఈ అరుదయిన పక్షి శబ్దాలతో ముందు కంగారుపడిన పోలీసులు, జనాలు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కన చెట్టు మీద ఈ పక్షిని గుర్తించారట. దీనిని స్టార్లింగ్ అనే పక్షిగా అని చెబుతున్నారు.

Tags:    

Similar News