అంతా సైలెంట్‌.. బీజేపీతో పొత్తు ఏమైన‌ట్టు?

బీజేపీతో పొత్తు కోసం ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీ.. రాజ‌కీయంగా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది.

Update: 2024-02-13 17:30 GMT

బీజేపీతో పొత్తు కోసం ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీ.. రాజ‌కీయంగా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. చంద్ర బాబు మూడు రోజుల కింద‌ట ఢిల్లీ వెళ్లిన విష‌యం తెలిసిందే. దీంతో టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్దంగా ఉంద‌ని.. దీనిని ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. బీజేపీకి కేటాయించే సీట్ల వ్య‌వ‌హారం కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ జిల్లాలో ఇన్ని.. ఆ జిల్లాల్లో అన్ని అంటూ.. లెక్క‌లు తెర‌మీ దికి చేరుకున్నాయి.

అయితే. అనూహ్యంగా ఈ చ‌ర్చ‌ల వ్య‌వ‌హారం స‌హా పొత్తుల విష‌యం కూడా.. సైలెంట్ అయిపోయింది. మ‌రోవైపు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు.. పంప‌కాలు.. పొత్తుల వ్య‌వ‌హారంతో గుస్సాగా ఉన్న నాయ‌కుల‌కు ఆయ‌న సోమ‌వారం నుంచే ఫోన్లు చేస్తున్నారు. వారిని బుజ్జ‌గిస్తున్నార‌ని స‌మాచారం. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక .. ప‌ద‌వులు ఇస్తామ‌ని.. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వారికి అండ‌గా ఉండాల‌ని ఆయ‌న కోరుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే.. ఎటొచ్చీ.. పొత్తుల వ్య‌వ‌హారం ఏమైంద‌నే ఆలోచ‌న మాత్రం పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. పొత్తుల‌పై బీజేపీ ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డం.. చంద్ర‌బాబు డిల్లీ నుంచి వ‌చ్చిన రోజే.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ డిల్లీ బాట ప‌ట్ట‌డం.. ప్ర‌ధానితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం.. ద‌రిమిలా.. బీజేపీ మ‌న‌సు మార్చుకుంటోందా? అని త‌మ్ముళ్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏదేమైనా.. ఇప్పుడు చ‌ర్చ‌ల వ్య‌వ‌హారం.. టీడీపీలో ఆస‌క్తిగా మారింది. చివ‌రి నిముషం వ‌ర‌కు ఎదురు చూడ‌కూడద‌నిభావిస్తున్న చంద్ర‌బాబుకు బీజేపీ ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాల‌ని కొంద‌రు అంటుంటే.. అదేంలేదు.. ఈ పొత్తు ఖాయ‌మ‌నేన‌ని .. అయితే.. కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు.

Tags:    

Similar News