బీజేపీ దువ్వుడు.. ఏపీ పార్టీలను పిచ్చెక్కిస్తోందే..!
ఇప్పుడు బీజేపీ ఎలా వ్యవహరిస్తోందనేదే ఆసక్తిగా మారింది. ఇటు.. వైసీపీకి, అటు టీడీపీకి కూడా.. పిచ్చెక్కించేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
కేంద్రంలోని బీజేపీ అండ కోసం.. ఏపీ లోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఎంతో ప్రయత్నం చేస్తున్నా యి. పొత్తుల కోసం.. టీడీపీ తెరచాటు, బయట కూడా.. బీజేపీ ని తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, వైసీపీ ప్రభుత్వం కూడా.. బీజేపీకి అన్ని విధాలా సహకారం అందిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు బీజేపీ ఎలా వ్యవహరిస్తోందనేదే ఆసక్తిగా మారింది. ఇటు.. వైసీపీకి, అటు టీడీపీకి కూడా.. పిచ్చెక్కించేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
పొత్తుల విషయాన్ని తేల్చకుండా టీడీపీ ని తికమక పడెతున్న బీజేపీ.. వైసీపీకి చేరువగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీని ని గమనించిన వారు ఇక, బీజేపీ.. టీడీపీతో చేతులు కలపదని వ్యాఖ్యానిస్తున్నారు. ఒంటరిగానే పోరాటం చేస్తారని అంటున్నారు. ఇది.. వైసీపీ లో ఖుషీ ని నింపుతోంది. ఇదిలావుంటే.. బీజేపీ వైసీపీకి చేరువ అవుతున్నట్టుగానే వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధుల ను వెంట వెంటనే ఇస్తోంది.
తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల ను కూడా నేరుగా ఇస్తామని ప్రకటించింది. ఇది వైసీపీకి , బీజేపీ చేస్తున్న మేలు. నిజమే. దీంతో వైసీపీ చెప్పినట్టే బీజేపీ నడుస్తుందని.. అందరూ భావిస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా ఇదే లెక్కలు వేసుకుంటున్నారు. కట్ చేస్తే.. ఇంతలోనే టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది. టీడీపీ కీలక నాయకులు చంద్రబాబు, నారా లోకేష్‌ల కు భద్రత ఎలా ఉందంటూ సర్కారు ను ప్రశ్నిస్తోంది.
దీంతో టీడీపీ నేతలు ఖుషీ అవుతున్నారు. తమ నాయకుల గురించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటోందంటే..తమవైపు అడుగులు వేస్తున్నట్టే కదా! అని కనకమేడల రవీంద్రకుమార్ వంటి ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకోవైపు.. వైసీపీ నాయకులను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయినందున.. వారంతా వైసీపీకే దన్నుగా ఉంటారని వైసీపీ భావిస్తోంది. మొత్తం ఎటూ తేలకుండా.. అంటే.. కట్టె విరగకుండా.. పాము చావకుండా అన్నటైపులో వ్యవహరిస్తూ.. బీజేపీ పిచ్చెక్కిస్తోందని అంటున్నారు పరిశీలకులు.