పవన్‌కు బీజేపీ ఆఫర్?
ఏపీలో కూటమితో జతకట్టిన బీజేపీ.. రాష్ట్రంలో రాజకీయంగా మరింత యాక్టివ్ కావాలని చూస్తోంది. అందుకు పవన్ సహకారంతో ముందుకు వెళ్లాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ వేగం అందుకోనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే పవన్‌ను డిప్యూటీ సీఎం చేస్తారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో కూటమితో జతకట్టిన బీజేపీ.. రాష్ట్రంలో రాజకీయంగా మరింత యాక్టివ్ కావాలని చూస్తోంది. అందుకు పవన్ సహకారంతో ముందుకు వెళ్లాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఏపీలో ముందునుంచే జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. ఎన్నికలకు ముందు టీడీపీ కూడా చేరడంతో కూటమిగా మారింది.
ఈ ఎన్నికల తర్వాత ఏపీలో మరింత బలోపేతం దిశగా బీజేపీ కార్యచరణ సిద్ధం చేస్తోందని తెలిసింది. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా సరే పవన్‌తో మాత్రం కలిసి ప్రయాణించాలని హైకమాండ్ అనుకుంటోందని సమాచారం. ఇందులో భాగంగా పవన్‌కు రెండు భారీ ఆఫర్లు ఇవ్వాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే పవన్‌ను డిప్యూటీ సీఎం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు కచ్చితంగా ఆ పదవి ఇచ్చే అవకాశముంది.
ఒకవేళ కూటమి ఓడిపోతే అప్పుడు కూడా పవన్‌తోనే సాగేందుకు బీజేపీ సుముఖంగా ఉంది. పవన్ పొలిటికల్ ఫ్యూచర్ బాధ్యతను బీజేపీ తీసుకునే అవకాశముందనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా పవన్‌ను కేంద్రంలోని మోడీ కేబినేట్‌లో సహాయ మంత్రిని చేయాలన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇలా మొత్తానికి ఏపీలో కూటమి గెలిచినా, ఓడినా పవన్‌కు మాత్రం తగిన ప్రాధాన్యత దక్కే అవకాశముంది. మరి బీజేపీ ఆఫర్ పట్ల పవన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.