మోడీ టీమ్ లోకి పవన్...సేనానికి హై ప్రయారిటీ ...!
అందుకే బీజేపీలో అపర చాణక్యుడు వ్యూహకర్త అయిన అమిత్ షా పొత్తుల కోసం చంద్రబాబుతో కలసి ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక సూచనలు చేశారు అని అంటున్నారు.
ఏపీ రాజకీయాల్లో ఎలాగోలా పాతుకు పోవడానికి బీజేపీ చూస్తోంది. వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందినట్లే అందుతున్నారు. కానీ మళ్లీ టీడీపీ వైపు మళ్ళుతున్నారు. నిజానికి 2024లో బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ ఇది. కాదు. పవన్ బీజేపీ కలసి థర్డ్ ఫోర్స్ గా ఏపీలో దూసుకుని రావాలని పక్కాగా ప్లాన్ చేసాయి. 2019 మేలో జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన ఆరు నెలల వ్యవధిలో అంటే 2020 జనవరిలోనే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.
దీనిని బట్టి చూస్తే 2024 ఏప్రిల్ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల టైం ఉంది. మరి ఇంతటి విలువైన కాలాన్ని వాడుకుని ఏపీలో మూడవ శక్తిగా ఎందుకు జనసేన బీజేపీ ముందుకు రాలేదు అంటే దానికి రెండు వైపులా తప్పులు ఉన్నాయి. దాని కంటే ముందు పవన్ బీజేపీతో కలసి ఉన్నా టీడీపీని వీడకపోవడం కారణంగా ఉన్నాయి.
ఈసారికి టీడీపీని ఓడిస్తే ఏపీలో తమదే 2029 నాటికైనా అధికారం అన్న బీజేపీ లెక్కలు ఇక్కడే తప్పాయి. మొత్తానికి చూస్తే అటు జనసేన బీజేపీ ముందే పొత్తు పెట్టుకున్నా 2024 నాటికి పొత్తు పార్టీలుగానే టీడీపీతో చేరాల్సి వస్తోంది.
ఈ విషయంలో ఎక్కువ బాధ జాతీయ పార్టీగా బీజేపీకి ఉంది. అందుకే పవన్ కి మరో చాన్స్ ఇస్తున్నారు. ఈసారి ఆయనను తమ వైపు పూర్తిగా తిప్పుకుని 2024 నుంచి 2029 దాకా అయిదేళ్ళ పాటు ఏపీలో కీలక శక్తిగా మార్చుకుంటే అప్పటికైనా ఏపీలో అధికారం సొంతం అవుతుంది అన్నది కమలనాధుల లెక్కలుగా ఉన్నాయి.
అందుకే బీజేపీలో అపర చాణక్యుడు వ్యూహకర్త అయిన అమిత్ షా పొత్తుల కోసం చంద్రబాబుతో కలసి ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక సూచనలు చేశారు అని అంటున్నారు. అదేంటి అంటే ఈసారికి లోక్ సభకు పోటీ చేయమని, ఏపీలో అధికారంలోకి కూటమి వచ్చినా పవన్ జాతీయ రాజకీయాల్లోకి రమ్మని అమిత్ షా స్వయంగా ఆహ్వానించారు అని అంటున్నారు.
పవన్ లోక్ సభకు పోటీ చేసి గెలిస్తే ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారు. అలా మోడీ క్యాబినెట్ లో మంచి మంత్రిత్వ శాఖతో గౌరవిస్తారు. ఇది చాలా మంచి ప్రతిపాదనగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీలో ఉంటే టీడీపీలో తరువాత స్థానంలోనే ఉంటారు. అదే కేంద్ర మంత్రిగా ఉంటే బాబుతో సమానంగా ఆయన కూడా ఏపీ రాజకీయాలను శాసిస్తారు.
అలా జరగాలనే బీజేపీ కోరుకుంటోంది. పవన్ ని ఎంపీగా బీజేపీ పోటీ చేయమనడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన సినీ గ్లామర్ ఆయన వెంట ఉన్న యూత్, ఆయన వైపు ఉన్న బలమైన సామాజిక వర్గం ఇవన్నీ కూడా రేపటి రోజున బీజేపీ జనసేన కూటమికి ప్లస్ అవుతాయని అంటున్నారు. నిజానికి బీజేపీ పవన్ విషయంలో చాలా సడలింపులు ఇస్తోంది అని అంటున్నారు.
బీజేపీ పెద్దలు ఎపుడూ తనతో విభేదించేవారిని దగ్గరకు రానీయరు. ఒకవేళ రావాలంటే ఎన్నో మెట్లు దిగి రావాలి. చంద్రబాబు విషయంలో అది అంతా చూస్తున్నదే. కానీ పవన్ బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో వెళ్ళినా పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టినా ఇంకా ఏమి చేసినా ఆయనను తమ వెంటే ఉంచుకోవడానికి బీజేపీ చూస్తోంది. ఎందుకంటే పవన్ విషయంలో ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఆయనలో నిజాయతీ. ఆయన మీద అవినీతి మరక లేదు.
ఆయనకు రాజకీయ వ్యూహాలు తెలియకపోవచ్చు కానీ తాము జాగ్రత్తగా ఆయన్ని గైడ్ చేస్తే ఏపీలో మంచి లీడర్ అవుతారు అన్న ఆలోచనలు బీజేపీ పెద్దలకు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఇంకా ఏర్పడని కేంద్ర బీజేపీ మూడవ ప్రభుత్వంలో పవన్ కి తొలి బెర్త్ ని వేసి బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఆహ్వానించడం. దీనిని పవన్ సీరియస్ గా తీసుకుని ఆలోచిస్తే మాత్రం ఆయన రాజకీయంగా ఇక గట్టిగా ఎదిగినట్లే.
రేపటి రోజున ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే నాదెండ్ల మనోహర్ వంటి వారు అక్కడ ఉంటారు. పవన్ జాతీయ రాజకీయాల్లో ఉంటూనే తన కేంద్ర మంత్రి పదవితో అధికారంలో ఇటు పార్టీని డెవలప్ చేసుకోవచ్చు. అటు తన చరిష్మాను పెంచుకోవచ్చు. మరో వైపు చూస్తే ఆయన కూడా ఫ్యూచర్ సీఎం గా ఎదగవచ్చు. దానికి అన్ని రకాలుగా అండగా బీజేపీ అగ్ర నాయకత్వం ఉంటుంది.
ఇక్కడ మరో పోలిక కూడా అంతా గుర్తుకు తెస్తున్నారు. పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కూడా బీజేపీ సూచనలు పాటిస్తే మేలు అని అంటున్నారు. మరి ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారు అని అంటున్నారు. అలా రెండు సీట్లు గెలుచుకున్న మీదటన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.