బీఆర్ ఎస్ దుకాణం బంద్ చేసే ఆలోచనలో బీజేపీ...!
తెలంగాణాలో బీఆర్ఎస్ వైభోగం అంతా గతం అవుతోంది. ఓడి మూడు నెలల సమయం అయింది.
తెలంగాణాలో బీఆర్ఎస్ వైభోగం అంతా గతం అవుతోంది. ఓడి మూడు నెలల సమయం అయింది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ బాగా రాజకీయ ఇబ్బందులను ఫేస్ చేస్తోంది అని అంటున్నారు. అధికారాంతముల చూడవలె అన్నట్లుగా గులాబీ పార్టీ నిండా గుబులు కమ్ముకుంది. పార్టీ దశ దిశ అర్ధం కాని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఒక్క ఓటమి వేయి అపజయాల సాటి అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీఎం గా యువ నేత రేవంత్ రెడ్డి దూకుడు చేస్తున్నారు. తనకు అందివచ్చిన అవకాశాన్ని ఆయన చక్కగా వాడుకుంటున్నారు. మూడు నెలల వ్యవధిలో ఆయన సీఎం గా తన గ్రాఫ్ ని మరింతగా పెంచుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా బీఆర్ఎస్ మీద ఫోకస్ పెట్టేసింది. బీఆర్ఎస్ ని అన్ని రకాలుగా ట్రబుల్స్ కి గురి చేస్తోంది.
ఆఖరుకు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అంటే బీజేపీ తో చేతులు కలుపుతారు అని ప్రచారం ఊపందుకుంటోంది. అయినా బీఆర్ఎస్ నుంచి ఎవరూ ఖండించడం లేదు సరి కదా మౌనంగా ఉంటున్నారు. అదే టైం లో కిషన్ రెడ్డి లాంటి వారు అవన్నీ తప్పుడు వార్తలు అంటూ బీఅర్ఎస్ తో పొత్తు ఏంటి అని తీసి పక్కన పెడుతున్నారు. అయినా సరే బీఆర్ఎస్ దీని గురించి ఏమీ అనకపోవడం చిత్రమే అని అంటున్నారు.
దీనిని బట్టి బీఅర్ ఎస్ మనసులో బీజేపీతో పొత్తు ఉండాల్సిందే అన్న భావన ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రచారం కూడా సాగుతోంది. ఫిబ్రవరి నాలుగవ వారంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అన్న వార్తలు అయితే వినిపించాయి. దాంతో కేసీఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్లేది బీజేపీ పెద్దలను కలవడానికే అని కూడా అంతా వైరల్ చేశారు.
చూస్తూంటే ఫిబ్రవరి నెల ముగిసిపోతోంది కానీ కేసీఆర్ మాత్రం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలేదు. దీనికి కారణం ఏమిటి అన్నది చూస్తే కనుక కేసీఆర్ కి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని మరో ప్రచారం సాగుతోంది. పీఎం అపాయింట్మెంట్ కుదిరితే కనుక కేసీఆర్ ఏనాడో ఢిల్లీకి వెళ్లి ఉండేవారు అని కూడా అంటున్నారు.
ఇక బీఆర్ఎస్ విషయంలో కానీ కేసీఆర్ విషయంలో కానీ బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణా నాయకత్వం గట్టిగా చెప్పింది ఏంటి అంటే కేసీఆర్ తో ఎట్టి పరిస్థితులలలో పొత్తు పెట్టుకోవద్దు అని. పొత్తు కనుక ఉంటే గులాబీ తోటను మనమే మళ్లీ పెంచి పోషించిన వాళ్ళం అవుతాము అని.
నిజానికి చూస్తే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచే రంగంలోకి దిగుతోంది. 2023 ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ బలంగా ఉంది, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పోటీ సగింది. ఇపుడు విపక్షంలోకి బీఆర్ఎస్ వచ్చెసింది. దాంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఢీ కొట్టాలీ అంటే బీజేపీ ఇపుడు బలమైన ఆల్టర్నేషన్ గా ముందుకు రావాలని చూస్తోంది.
ఎటూ కేంద్రంలో 2024 తరువాత మూడవసారి అధికారంలోకి వస్తామన్న నమ్మకం అయితే బీజేపీకి ఉంది. కేంద్రం అండతో తెలంగాణాలో తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే తొందరలో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏంటో తెలిసిపోతుంది అని అంటున్నారు. తెలంగాణాలో కనుక బీఆర్ఎస్ కనీస మాత్రంగా అయినా ఎంపీ సీట్లను తెచ్చుకోకపోతే అపుడు రాజకీయం మొత్తం ఉల్టా అవుతుంది అని బీజేపీ భావిస్తోంది.
అసలు ఎంపీ ఎన్నికల్లోనే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే పోరు ఉంటుందని అది లాభిస్తుందని ఊహిస్తోంది. అలా కాంగ్రెస్ ని ఎదురొడ్డి తాము నిలిస్తే ఆటోమేటిక్ గా 2028 నాటికి తిరుగులేని శక్తిగా తెలంగాణాలో మారి అధికారంలోకి రావచ్చు అన్నదే బీజేపీ ఎత్తుగడగా ఉంది.
ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ తెలంగాణా ఎన్నికల తెర మీద అంతర్ధానం కావడమే బీజేపీ ఎపుడూ కోరుకునేది అని అంటున్నారు. అద్నుకే బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు వద్దు అనే తెలంగాణా బీజేపీ నాయకత్వం అంటోంది. కేంద్ర నాయకత్వం కూడా అదే మాట మీద ఉండడంతోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ కి గ్రీన్ సిగ్నల్ రాలేదని, ఆయనకు మోడీ అపాయింట్మెంట్ దక్కలేదని ప్రచారం సాగుతోంది.
మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ ఎస్ కనుక గట్టిగా అరడజన్ సీట్లు సాధినకపోతే మాత్రం ఖేల్ ఖతం దుకాణం బంద్ అని బీజేపీయే దూకుడు చేసి మరీ గులాబీ తోటలో కాషాయ జెండాను పాతేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.