ఏపీ బీజేపీ లో ఆ ఇద్ద‌రి టాప్ లీడ‌ర్ల‌కు ప‌ద‌వులొచ్చేనా..!

ఆది నారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్‌ల‌ కు బీజేపీ లో ప్రాధాన్యం లేద‌నే టాక్ త‌ర‌చు గా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

Update: 2023-07-25 02:30 GMT

టీడీపీ మాజీ నాయ‌కులు ఆది నారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్‌ల‌ కు బీజేపీ లో ప్రాధాన్యం లేద‌నే టాక్ త‌ర‌చు గా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న ఆది నారాయ‌ణ‌రెడ్డి.. 2014లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని.. త‌ర్వాత టీడీపీ లో చేరి మంత్రి అయ్యారు. 2019లో క‌డప నుంచి ఎంపీ గా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకోలేకపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ లో చేరారు. అయితే.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఉన్నంత‌వ‌ర‌కు బాగానే ఉంది.

సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. అనూహ్యంగా ఆదికి ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో ఆయ‌న ఒకింత ముభావంగానే ఉన్నారు. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌, తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యం లోనూ సోము వీర్రాజు.. సొంత నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని ఆయ‌న గ‌తం లో ఆరోపించారు. ఇక‌, సీఎం ర‌మేష్ కూడా.. సుదీర్ఘ కాలం టీడీపీ లో ఉండి.. రాజకీయ మార్పుల నేప‌థ్యంలో ఆయ‌న కూడా బీజేపీ కి జై కొట్టారు. ఆయ‌న ప‌రిస్థితికూడా ఇలానే ఉంది.

పార్టీలో మంచి గ‌ళం వినిపించ‌డంతోపాటు.. కేంద్రం నుంచి పెద్ద‌లు వ‌చ్చిన‌ప్పుడు వారికి అనేక రూపాల్లో సేవ‌లు అందించినా.. త‌మ‌కు గుర్తింపు లేకుండా పోయింద‌ని ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా వ‌గ‌రుస్తున్నా రు. ఇదే విష‌యాన్ని తాజాగా సీమ‌ లో ప‌ర్య‌టించిన పురందేశ్వ‌రి ముందు చెప్పుకొచ్చారు. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో మేం సూచించిన అభ్య‌ర్థికి టికెట్ ఇచ్చి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేద‌ని.. చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశామ‌ని వివ‌రించారు.

అయినా.. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా.. కేవ‌లం జిల్లాకే ప‌రిమితం చేశార‌ని.. పోనీ.. అప్పుడైనా జిల్లా నాయ‌కులు చెప్పిన మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకోవాలి క‌దా.. అది కూడా చేయ‌లేద‌ని వివ‌రించారు. దీంతో పురందేశ్వ‌రి గ‌తం అయిపోయింద‌ని.. ప్ర‌స్తుతం పార్టీని బ‌లోపేతం చేసుకోవాల్సి ఉంద‌ని.. సో.. పార్టీ కోసం అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ప‌నిచేస్తే.. విజ‌యం సొంత మ‌వుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే వీరికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు ద‌గ్గుబాటి వివ‌రించారు.

Tags:    

Similar News