షాకింగ్... 17వేల మందికి 'పింక్ స్లిప్' ల పంపిణీ ప్రారంభం!

ఈ క్రమంలో ఇప్పటికే వేల మంది ఉద్యోగులకు పలు కంపెనీలు షాకిచ్చేశాయి.

Update: 2024-11-14 16:21 GMT

ఆర్థిక మాంద్యం ప్రభావం, ప్రాజెక్టు లేకపోవడం, భారం తగ్గించుకునే ప్రయత్నం... కారణం ఏదైనా పలు బడా కంపెనీలు వందల, వేల సంఖ్యలో సిబ్బందిపై వేటు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వేల మంది ఉద్యోగులకు పలు కంపెనీలు షాకిచ్చేశాయి. ఈ క్రమంలో గతకొంత కాలంగా వస్తోన్న కథనాలను నిజం చేస్తూ బోయింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ తీసుకున్నట్లు ఇంతకాలం కథనాలొచ్చిన నిర్ణయం ఇప్పుడు అధికారికం అయ్యిందని అంటున్నారు. ఇందులో భాగంగా... బోయింగ్ కంపెనీ పింక్ స్లిప్ లను పంపడం ప్రారంభించిందని అంటున్నారు. వాస్తవానికి చాలా రోజులుగా సియాటెల్ ప్రాంతంలో సుమారు 33,000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు.

ఫలితంగా... 737, 767, 777 మ్యాక్స్ జెట్ ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు సంస్థ తెలిపింది. ఈ సమయంలో... కంపెనీ గత నెలలో పొజిషన్లలో సుమారు 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా సుమారు 17,000 మంది ఉద్యోగులకు సమానం.

ఇప్పటికే ఈ విషయాలపై స్పందించిన కంపెనీ సీఈఓ కెల్లీ ఓర్ట్ బర్గ్... సమ్మె కారణంగా సంస్థకు భారీ నష్టాలు వచ్చాయని.. ఈ నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. ఈ క్రమంలో ఈ నష్టాలను పూడ్చేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని అన్నారు. సంస్థ దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి కఠిన చర్యలు తప్పనిసరి అని తెలిపారు.

Tags:    

Similar News