డ్యూటీ ఎక్కిన బొత్స...షాకులేనా ?

ఇదిలా ఉంటే వైసీపీలో చేరిన బొత్సకు కీలకమైన స్థానమే దక్కుతోంది.

Update: 2024-08-24 20:30 GMT

ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గురించి ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన గత నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రాలో కీలక రాజకీయ నేతగా ఉన్నారు. ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. సీఎం కూడా కావాలన్నది ఆయన కోరిక. కానీ అది నెరవేరలేదు.

ఇదిలా ఉంటే వైసీపీలో చేరిన బొత్సకు కీలకమైన స్థానమే దక్కుతోంది. ఆయన వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. వైసీపీ ఓటమి చెందాక రెండు నెలలు తిరగకుండానే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. శాసనమండలిలో అపొజిషన్ లీడర్ అయ్యారు.

వైసీపీ మొత్తం మీద కేబినెట్ ర్యాంక్ ఉన్న నేత ఎవరూ అంటే అది బొత్స అని చెప్పాలి. ఇక బొత్స ఎమ్మెల్సీ విపక్ష నేత పదవులు దక్కడంతో డ్యూటీ ఎక్కేశారు. ఆయన విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన దారుణ ఘటనలో బాధితులను పరామర్శించారు.

తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. సంఘటన జరిగిన వెంటనే టీడీపీ కూటమి సర్కార్ స్పందించలేదని జాప్యం తీవ్రంగా జరిగింది అన్నారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో వైసీపీ మంత్రులు నాడు వెంటనే స్పందించారని, సీఎం జగన్ కూడా ఘటన జరిగిన నాలుగైదు గంటలోనే వచ్చి పరిహారం చెల్లించాలని గుర్తు చేశారు.

ఆనాడు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అంతా దగ్గర ఉండి అన్నీ రకాలుగా సహాయం చర్యలు తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తమను నిందించడమే పనిగా పెట్టుకుందని బాధితులను ఆదుకోవాలనే తాము కోరుతున్నామని ఇందులో రాజకీయం చేసేది లేదని అన్నారు.

ఇదిలా ఉంటే బొత్సకు పదవి దక్కడంతో ఆయన ప్రతీ రోజూ మీడియా ముందుకు వస్తున్నారు. అలాగే సంఘటన జరిగినా ముందే ఉంటున్నారు. ఒక విధంగా వైసీపీలో ఆయన నంబర్ టు గా ఉన్నారని అంటున్నారు. మరో వైపు మాజీ ముఖ్యమంత్రి అన్న ట్యాగ్ తప్ప జగన్ కి కేబినెట్ హోదా అన్నది లేదు. ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.

ఆయన్ని జస్ట్ ఎమ్మెల్యే అని తీసి పక్కన పెట్టేస్తున్న కూటమి పెద్దలు బొత్స చేసే విమర్శలకు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు బొత్సని జస్ట్ ఎమ్మెల్సీ అనడానికి లేదని కూడా అంటున్నారు. ఆయన అపొజిషన్ లీడర్ గా ఉన్నారని అంటున్నారు. దాంతో బొత్స ఒక విధంగా వైసీపీలో పవర్ ఫుల్ అని అంటున్నారు.

బొత్స పవర్ ఫుల్ గా ఉంటే షాకులు ఎవరికి అన్న మరో చర్చ కూడా సాగుతోంది. ఆయన కూటమి మీద దూకుడు చూపిస్తున్నారు. అలాగే వైసీపీకి వాయిస్ గా మారుతున్నారు. మరి అమాంతం పెరిగిన ఆయన ప్రాధాన్యత వైసీపీకి మేలు చేస్తుందా వైసీపీకి బూస్టింగ్ గా ఉంటుందా లేక కొత్త ట్రబుల్స్ క్రియేట్ చేస్తుందా అన్న చర్చ కూడా లేకపోలేదు. ఏది ఏమైనా గత కొన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నుంచి సీనియర్ నేత బొత్స గొంతు విప్పుతున్నారు. అది వైసీపీకి ఒక పెద్ద ఊరటగానే ఉంది. రానున్న రోజుల్లో బొత్స షాకులు ఎవరికి అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News