గుండు గీయించుకుంటానంటున్న బొత్స... సంక్రాంతే లక్ష్యం!

దీంతో అనుమతులు అన్నీ ఉన్నాయంటూ స్పందించిన బొత్స.. రెండు పార్టీల పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-08-12 06:32 GMT

వారాహి యాత్ర 3.0 లో ఉన్న పవన్ కల్యాణ్... ఏపీ సర్కార్ పైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రుషికొండలో పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో అనుమతులు అన్నీ ఉన్నాయంటూ స్పందించిన బొత్స.. రెండు పార్టీల పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవును... పర్యావరణ అనుమతులు లేవని పవన్ చెబుతున్నాడు, అన్ని అనుమతులూ తీసుకుని తాము ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. ఇంకా ఏమైనా అనుమానం ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నో, కోర్టులనో ఆశ్రయించ వచ్చని సూచించారు. ఈ సమయంలో టీడీపీ - జనసేనలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలంటేనే అసహ్యం వేసేలా రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తిన బొత్సా సత్యన్నారాయణ... వచ్చే సంక్రాంతి నాటికి అలాంటి పార్టీలు ఉండవని, కనుమరుగైపోతాయని, ఆలాకానిపక్షంలో తాను గుండు కొట్టించుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం చంద్రబాబు, పవన్ లపై సెటైర్స్ వేశారు బొత్స.

ఇందులో భాగంగా... ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనే వ్యక్తి.. మరొకరు అవగాహన లేని చేతలు మాటల సెలబ్రెటీ అంటూ చంద్రబాబు - పవన్ లపై బొత్సా ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే పెద్దవాడైపోయానని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇదే సమయంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని గుర్తు చేసిన బొత్స... అన్న పార్టీ మూసేసిన తరువాత తమ్ముడు దుకాణం తెరిచాడని ఎద్దేవా చేసారు. ఇదే సమయంలో వాలంటీర్ల గురించి రోజుకో మాట మారుస్తున్నారని మండిపడ్డారు. చెప్పుతో కొడతామని చేస్తోన్న వ్యాఖ్యలపైనా బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులు అందరికీ ఉంటాయనే విషయం ఆ గుర్తించుకోవాలని ఫైరయ్యారు.

ఈ సందర్భంగా... జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే మట్టి కొట్టుకుపోతారంటూ బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. ప్రజల మంచి చెయాలనే తపన విపక్షాలకు లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతసేపు రాజకీయాలే తప్ప చిత్తశుద్ది లేదని బొత్సా పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి!

Full View
Tags:    

Similar News