మంత్రి గారి సతీమణి లాయరమ్మ అయ్యారు !

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లాయర్ అయ్యారు

Update: 2023-08-16 03:48 GMT

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లాయర్ అయ్యారు. ఆమె హై కోర్టు నుంచి ప్రాక్టీస్ చేసేందుకు హై కోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ షిప్ తీసుకున్నారు. ఆమె రెండు పీ హెచ్ డీలు చేశారు. ఏం ఏ ఎం ఫిల్ చేశారు. న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. దాంతో విద్యా శాఖ మంత్రి సతీమణి చదువుల సరస్వతిగా మారారని అంటున్నారు.

ఆమె కూడా రాజకీయంగా కీలక పదవులు ఎన్నో నిర్వహించారు. ఆమె విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించారు. అలా ఆమె ఆ పదవిలో ఉండగానే బొబ్బిలి నుంచి ఎంపీగా గెలిచారు. అలాగే విజయనగరం పార్లమెంట్ గా మారితే తొలిసారి ఎంపీగా గెలిచారు. ఇలా రాజకీయంగా ఆమె తన సత్తా చాటుకుంటూనే మరో వైపు విద్యా రంగంలోనూ రాణిస్తున్నారు.

ఆమె వయసుతో చదువుకు పని లేదని చాటి చెబుతూ మహిళా లోకానికే కాదు వయోజనులందరికీ ఆదర్శం అయ్యారు. ఇదిలా ఉంటే మంత్రి బొత్స సత్యనారాయణ తన సతీమణి లాయర్ గా మెంబర్ షిప్ హై కోర్టులో నమోదు చేసుకోవడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఆమె సామాన్యుల కోసం న్యాయం కోసం ఎదురుచూసే వారికి అండగా పనిచేయాలని కోరారు. ఆమె లాయర్ గా మారినందుకు అభినందించారు. ఇదిలా ఉండగా బొత్స సత్యనారాయణ డిగ్రీ మాత్రమే చదివారు. కానీ ఆయన సతీమణి మాత్రం ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా ఈ రోజుకీ అలుపు లేకుండా చదువుల కోసం తన సమయాన్ని ఖర్చు చేస్తున్నారు.

మరో వైపు చూస్తే ఆమెను వచ్చే ఎన్నికల్లో విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. బొత్స గత ఎన్నికల్లోనే తన భార్యకు ఎంపీ టికెట్ అడిగారని ప్రచారంలో ఉంది. అయితే అప్పటికే బొత్స ఫ్యామిలీకి ఎక్కువ టికెట్లు ఇచ్చినందువల్ల దాన్ని బెల్లాన చంద్రశేఖర్ కి ఇచ్చారు.

ఈసారి బెల్లాన చంద్రశేఖర్ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆయన ఎంపీగా పోటీకి సుముఖంగాలేరు. దాంతో బలమైన అభ్యర్ధిగా బొత్స ఝాన్సీ వైఇపే అధిష్ఠానం చూపు ఉందని అంటున్నారు. అన్నీ కుదిరితే కొత్త లాయరమ్మ మరోసారి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెడతారు అని అంటున్నారు. బొత్స సైతం ఆ దిశగా పావులు కదుపుతున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News