ఇది పూర్తిగా ఎన్నికల బ్రేక్ పాస్టేనా ?

తెలంగాణాలో సడెన్ గా స్కూళ్ళల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలైంది. ఇంత సడెన్ గా ఎందుకీ బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలైంది ? ఎందుకంటే నూరుశాతం ఎన్నికల్లో లబ్ది కోసమని అర్ధమైపోతోంది

Update: 2023-10-07 09:40 GMT

తెలంగాణాలో సడెన్ గా స్కూళ్ళల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలైంది. ఇంత సడెన్ గా ఎందుకీ బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలైంది ? ఎందుకంటే నూరుశాతం ఎన్నికల్లో లబ్ది కోసమని అర్ధమైపోతోంది. ప్రతిపక్షాలపై పైచేయి సాధించాలని చాలాకాలంగా కేసీయార్ ఆలోచిస్తున్నారు. అందులో నుండి వచ్చిన ఆలోచనే స్కూళ్ళల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం. ఇప్పటికే స్కూళ్లలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి బ్రేక్ ఫాస్ట్ పథకం అదనం అన్నమాట. ఎన్నికల షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని సడెన్ గా ప్రారంభించేశారు.

తాజా పథకం వల్ల స్కూళ్లలో చదువుతున్న సుమారు 27 లక్షలమంది పిల్లలకు ఉపయోగం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మధ్యాహ్న భోజన పథకమే సక్రమంగా అమలుకావటంలేదు. అందుకనే మిడ్డే మీల్సుకే దిక్కులేదు కానీ మళ్ళీ బ్రేక్ ఫాస్ట్ కూడానా అని ప్రతిపక్షాలు అప్పుడే ఆరోపణలు, సెటైర్లు అందుకున్నాయి. కారణం ఏమిటంటే చాలా స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావటం లేదు. కారణం ఏమిటంటే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటమే.

ఇక్కడ విషయం ఏమిటంటే 2018లో అధికారంలోకి రాగానే జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఏమైందో ఎవరికీ తెలీదు. ఇది సరిపోదన్నట్లుగా 2020లో డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఎంతో ఆర్భాటంగా కేసీయార్ ప్రకటించారు. ఈ ప్రకటనచేసి మూడేళ్ళయినా ఇంతవరకు అతిగతీ లేదు. పోనీ స్కూళ్ళల్లో అయినా సక్రమంగా అమలవుతోందా అంటే అదీలేదు.

బిల్లులు పెండింగులో ఉండిపోవటంతో కాంట్రాక్టర్లకు నిధుల రొటేషన్ కుదరటంలేదు. దాని ప్రభావం మిడ్డే మీల్స్ పైన పడుతోంది. దాంతో విద్యార్ధులు అవస్తలు పడుతున్నారు. వాస్తవ పరిస్ధితి ఇదైతే సడెన్ గా బ్రేక్ ఫాస్టు కూడా మొదలుపెట్టారు. మధ్యాహ్న భోజన పథకానికే బిల్లులు చెల్లించని ప్రభుత్వం ఇపుడు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుందా ? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎంతోకొంత బిల్లులు చెల్లిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఇపుడు మొదలైన బ్రేక్ ఫాస్ట్ పథకమైతే ఫక్తు ఎన్నికల పథకమనే చెప్పడంలో సందేహమే అవసరంలేదు.

Tags:    

Similar News