బెంగళూరులో బ్రిటన్ రాజ్... ఎస్.ఐ.హెచ్.హెచ్.సీ. పై ఎంత నమ్మకమంటే..?

అవును... బ్రిటన్ రాజు ఛార్లెస్-3 తన సతీమణి కెమిల్లాతో కలిసి భారత్ లో రహస్యంగా పర్యటించారు.

Update: 2024-10-31 03:46 GMT

భారతదేశం కళలకు నెలవు, సంప్రదాయాలకు పుట్టినిల్లు అంటారు.. అంతే కాదు ఇప్పుడు భారతదేశ సంప్రదాయ వైద్యం వరల్డ్ ఫేమస్ అవుతోంది! భారతదేశ సంపద అయిన యోగా, ధ్యానం, పలు రకాల థెరపీల వల్ల ఎన్నో రోగాల నుంచి ఉపశమనం దక్కుతుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అవుతోంది.

దీంతో.. అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఎంతోమంది భారతదేశపు సాంప్రదాయ వైద్యం కోసం వస్తున్నారు. దివంగత దిగ్గజ పారిశ్రామిక వేత్త ప్రపంచంలోని ఏ హాస్పటల్ లో అయినా వైద్యం చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. తమిళనాడుకు చెందిన కోము లక్ష్మణన్ దగ్గర వర్మమ్ థెరపి అనే సంప్రదాయ వైద్యం చేయించుకునేవారు. ఇప్పుడు బ్రిటన్ రాజు వంతొచ్చింది.

అవును... బ్రిటన్ రాజు ఛార్లెస్-3 తన సతీమణి కెమిల్లాతో కలిసి భారత్ లో రహస్యంగా పర్యటించారు. అక్టోబర్ 24 - 26 మధ్య సమోవలో నిర్వహించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాల్లో పాల్గొన్న ఛార్లెస్ దంపతులు.. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు.

ఈ సమయంలో ఈ నెల 27 నుంచి బెంగళూరు సమీపంలోని సౌఖ్య ఇంటర్నేషనల్ హాలిస్టిక్ హెల్త్ సెంటర్ (ఎస్.ఐ.హెచ్.హెచ్.సీ.) లో ఉన్నారు. 75 ఏళ్ల ఛార్లెస్... క్యాన్సర్ ధృవీకరణ అయిన తర్వాత భారత సంప్రదాయ వైద్యాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు. వాస్తవానికి గతంలో ఆరు సార్లు ఇక్కడికి వచ్చినా.. బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం తర్వాత ఇక్కడకూ రావడం ఇదే తొలిసారి.

ఎస్.ఐ.హె.హె.సి లో బ్రిటన్ రాజు యోగా, ధ్యానం, పలు రకాల థెరపీలతో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఇసాక్ మథై నిర్వహిస్తున్న ఈ ఎస్.ఐ.హెచ్.హెచ్.సీ. ను ఛార్లెస్ గతంలో ఆరు సార్లు సందర్శించగా.. 2019లో తన 71వ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇక్కడే చేసుకోవడం గమనార్హం.

అయితే.. ఇది బ్రిటన్ రాజు దంపతులకు పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో వీరి పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారు. వీరు బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు.

Tags:    

Similar News