ఓన్లీ వన్ షాట్ : బీజేపీ...బీయారెస్ కాంగ్రెస్ టార్గెట్!

అది అమలు చేస్తున్నారు. అలాగే తెలంగాణాలో కీలక హామీలతో కాంగ్రెస్ ముందుకు వస్తోంది.

Update: 2023-09-16 00:30 GMT

ఢిల్లీలో ఉండాల్సిన కాంగ్రెస్ అధినాయకత్వం మూడు రోజుల పాటు హైదరాబాద్ కి మకాం మార్చేసింది. కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గె అంతా కలసి హైదరాబాద్ కి విచ్చేస్తున్నారు. రెండు రోజుల పాటు సీడబ్య్లూసీ మీటింగ్ హైదరాబాద్ లో జరగనుంది. మూడవ రోజు తెలంగాణాలో టీ కాంగ్రెస్ ప్రచార ర్యాలీలను ప్రారంభించనున్నారు

ఆగస్ట్ లో సీడబ్యూసీ కొత్త కార్యవర్గం ఎంపిక అయింది. తొలి మీటింగ్ నే ఢిల్లీ కాకుండా హైదరాబాద్ లో పెట్టడం వెనక కాంగ్రెస్ మాస్టర్ స్ట్రాటజీ ఉంది అంటున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల కోసం వ్యూహాలు రూపకల్పన చేయడం ఒక ఎత్తు అయితే ఈసారి ఎలాగైనా తెలంగాణాను వదలరాదు అన్నది కాంగ్రెస్ పంతంగా ఉంది.

బీజేపీకి ఉత్తరాదిలో బలం ఉంటే కాంగ్రెస్ కి దక్షిణాదిలో మద్దతు ఉంది. ఉమ్మడి ఏపీ కంచుకోట. ఇపుడు దాన్ని కైవశం చేసుకోవడానికే తెలంగాణా మీదుగా ఏపీకి గురి పెడుతోంది కాంగ్రెస్. మరో వైపు చూస్తే ఈ నెల 17న తెలంగాణా విమోచన దినాన్ని కాంగ్రెస్ విజయ్ దివస్ గా జరుపుతోంది. దీని వెనక కూడా క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ఎత్తుగడ ఉంది.

దేశంలోని అయిదు వందలకు పైగా సంస్థానాలను కలుపుకున్న అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నిజాం ఆద్వర్యంలోని హైదరాబాద్ స్టేట్ మాత్రం లొంగలేదు. దాంతో సైనిక చర్య ద్వారానే నాటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ భారత్ లో హైదరబాద్ రాష్ట్రాన్ని కలిపారు. అంటే అదంతా కాంగ్రెస్ ఖాతాలోనే వస్తుంది. నాడు దేశ ప్రధానిగా నెహ్రూ ఉన్నారు. ఈనాటికి హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం అయి 76 ఏళ్ళు అవుతోంది.

దాంతో తుక్కుగూడాలో ఈ నెల 17న జరిగే విజయ్ దివస్ ర్యాలీలో సోనియగాంధీ పాల్గొంటారు. అదే నేపధ్యంలో తెలంగాణా ఎన్నికల కోసం అయిదు కీలక హామీలను ఆమె ఇవ్వనున్నారు. కర్నాటకలో కూడా అయిదు ముఖ్య హామీలను ఇచ్చి వంద రోజుల పాలనలోగా వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. అది అమలు చేస్తున్నారు. అలాగే తెలంగాణాలో కీలక హామీలతో కాంగ్రెస్ ముందుకు వస్తోంది.

మరో వైపు చూస్తే ఉమ్మడి ఏపీలో ఉన్న తెలంగాణాను విభజించి సొంత అస్తిత్వాన్ని రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదే అని తుక్కుగూడ సభ ద్వారా టీ కాంగ్రెస్ నాయకులు చెప్పనున్నారు. సోనియా గాంధీ సైతం తాను తెలంగాణా ఎలా ఇచ్చానో ప్రజలకు వివరించి పదేళ్ళ పాటు విపక్షంలో తమను పెట్టారని అధికారం ఈసారి ఇవ్వాలని కోరతారు అని అంటున్నారు.

ఇక నిజాం పాలన మీద విమర్శలు చేస్తూ విమోచనా దివస్ అని బీజేపీ చేపడుతూ వస్తోంది. దానికి కౌంటర్ గా హైదరాబాద్ స్టేట్ ని కలిపిందే తాము అని కాంగ్రెస్ క్లెయిం చేసుకుంటోంది అన్న మాట. ఇక తెలంగాణాను ఇచ్చింది తామే అని బీయారెస్ కి దెబ్బ తీయబోతోంది. ఈ రెండు అస్త్రాలతో తుక్కుగూడ సభ సాగనుంది. సీడబ్య్లూసీలో తెలంగాణా మీదనే ఎక్కువగా ఫోకస్ పెడతారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా అటు బీయారెస్ ఇటు బీజేపీలకు చెక్ పెట్టేందుకే సోనియా రాహుల్ ఖర్గే త్రయం మూడు రోజుల పాటు హైదరాబాద్ లో రాజకీయ మంత్రాంగాన్ని రచించబోతున్నారు అంటున్నారు.

Tags:    

Similar News