శ్వేతపత్రం x ప్రగతి నివేదిక -పార్టీల మధ్య రాజకీయ దుమారం!

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో దానికి కౌంటర్ గా ప్రతిపక్షం కూడా రెడీ అవుతోంది.

Update: 2023-12-20 11:05 GMT

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో దానికి కౌంటర్ గా ప్రతిపక్షం కూడా రెడీ అవుతోంది. ఇరిగేషన్, ధరణి, విద్యుత్ శాఖల్లో జరిగిన అవినీతిని ఎండగట్టాలని చూస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టి శ్వేతపత్రానికి దీటుగా ప్రతిపక్షం ప్రగతినివేదికను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈనేపథ్యంలో పరస్పరం ఇరు పార్టీల పంతాలు నెగ్గించుకోవాలని చూస్తున్నాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండు తమ నివేదికలు బహిర్గతం చేయాలని యోచిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తీరుపై శ్వేతపత్రం విడుదల చేస్తే దానికి విరుగుడుగా బీఆర్ఎస్ ప్రగతి నివేదికతో రెడీ అవుతున్నాయి. పదేళ్లలో సాధించిన ప్రగతిని సభ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వారికి ప్రగతి నివేదిక బహిర్గతం చేసే అవకాశం ప్రభుత్వం ఇవ్వదని తెలుస్తోంది. దీంతో ప్రగతి నివేదికను కనీసం విలేకరుల ముందైనా ప్రదర్శించాలని ప్రతిపక్షం పావులు కదుపుతోంది.

అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా అందుకు ప్రభుత్వం సమ్మతించే సూచనలు లేవు. పవర్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం రాకపోతే కనీసం మీడియా ముందుకెళ్లాలనే యోచనలో ప్రతిపక్షం ఉందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో ప్రతిపక్షం ఆలోచన అమలు చేసే ఉద్దేశంతో ప్రగతి నివేదికను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే వాదనలో ఉన్నట్లు సమాచారం.

సాగునీటి రంగంలో అవినీతి కొండెక్కి కూర్చుంది. లక్షల కోట్లు దుర్వినియోగం అయినట్లు చెబుతున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల్లో చోటుచేసుకున్న అవినీతితో ప్రజాధనం పనికి రాకుండా పోయిందనే వాదనలు వస్తున్నాయి. ప్రభుత్వం నిధులన్ని నీళ్లలో పోసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. అవినీతిలో ప్రభుత్వ వాటా ఎంత అనే దానిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న డెవలప్ మెంట్ ను లెక్కలతో సహా తెలియజెప్పేందుకు రెడీ అవుతోంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేపట్టిన పనులు వాటి ఫలితాల గురించి పవర్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. రెండు పక్షాల మధ్య జరుగుతున్న పరిణామాలతో చివరకు ఏం జరుగుతుందో తెలియడం లేదు.

Tags:    

Similar News