కేటీఆర్ : ఫీనిక్స్ పక్షిలా ఎగిరివస్తాం
‘లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుది. ఫీనిక్స్ పక్షిలా ఎగిరివస్తాం
‘లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుది. ఫీనిక్స్ పక్షిలా ఎగిరివస్తాం. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశాం’ అని బీఅర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
తెలంగాణ ఉద్యమం నుండి అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉంది. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన గౌరవం, విజయం మరేది లేదు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలున్నాయి అని కేటీఅర్ అన్నారు.
తెలంగాణ సాధించటంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ 2014 లో 63 సీట్లు, 2018 లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ స్వల్ప తేడాతోనే ఓటమి పాలైంది.లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారు. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమే. గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దని మా పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారు. బీఆర్ఎస్ అదే సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఎప్పటి లాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాం. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం. తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్ఎస్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం అని కేటీఆర్ తెలిపారు.