బీఆర్ఎస్ కు గుదిబండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం?
లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్ర పన్నుతున్నారని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రచ్చగా మారుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కోసం అధికారులు పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేసిన తతంగం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో అప్రూవర్ గా మారిని అధికారి రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా బీఆర్ఎస్ నేతలపై ఉచ్చు బిగుసుకుంటోంది. చేసిన పాపానికి పరిహారం అనుభవించక తప్పదని తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్ర పన్నుతున్నారని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. తమను కావాలనే కేసులో ఇరికించేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావాలనే దురుద్దేశంతోనే కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం స్పందిస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా కేసీఆర్ పేరే వినిపిస్తోంది. కేసీఆర్ కోసమే తాము ఆ పని చేశామని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. దీంతో ఉచ్చు బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోందని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది ముమ్మాటికి కుట్రే అని కొట్టిపారేస్తున్నారు. స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ అధికారులు బీఆర్ఎస్ నేతలదే తప్పని వాదిస్తున్నారు. దీంతో కేసు బీఆర్ఎస్ కు గుదిబండగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ తో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. వారి ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత పర్యటనల గురించి తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేసినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన చాలా లావాదేవీల్లో అధికారుల పాత్ర ఉందని వారే ఒప్పుకుంటున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ కు మరో భారంగా మారనుందని తెలుస్తోంది.