టెన్షన్ పెరిగిపోతోందా ?
మాజీ ఎంపీ బుట్టారేణుకలో టెన్షన్ పెరిగిపోతోందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. టెన్షన్ ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు తేలిపోయే రోజు దగ్గరకు వచ్చేస్తోందట.
మాజీ ఎంపీ బుట్టారేణుకలో టెన్షన్ పెరిగిపోతోందా ? సోషల్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. టెన్షన్ ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు తేలిపోయే రోజు దగ్గరకు వచ్చేస్తోందట. ఈనెలాఖరులోగా నియోజకవర్గాల్లో మార్పులను పూర్తిచేయాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇప్పటికే మంత్రులు, ఎంఎల్ఏలు 11 మందికి నియోజకవర్గాలను మార్చి ఇన్చార్జిలుగా నియమించిన విషయం తెలిసిందే. తొందరలోనే మరో 40 మందిని కూడా మార్చటం ఖాయమని సోషల్ మీడియా లోనే టాక్ వినబడుతోంది.
ఈ మార్పుల్లో కొందరికి టికెట్లు ఇవ్వకుండా పక్కనపెట్టేస్తారనే ప్రచారం కూడా పెరుగుతోంది. కాబట్టి ఆ మార్పుల్లో తనకు టికెట్ ఎక్కడైనా దక్కుతుందా అని బుట్టా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మార్పుల్లో భాగంగా అన్నీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను వేసేస్తే అప్పుడు ఏమిచేయాలో బుట్టాకు అర్ధంకావటంలేదట. కర్నూలు ఎంపీగా ప్రయత్నాలు చేసుకుంటున్నా టికెట్ దక్కే అవకాశాలు లేవట. పోనీ ఎమ్మిగనూరు, పత్తికొండ అసెంబ్లీలకు ప్రయత్నిద్దామంటే అక్కడా అవకాశాలు లేవు. జగన్ అసలు టికెట్ పై బుట్టాకు ఎలాంటి హామీ ఇవ్వనేలేదు. దాంతో తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో బుట్టాకు అర్ధంకావటంలేదట.
నిజానికి పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించకున్న జగన్ను బుట్టా మోసం చేశారు. 2014లో కర్నూలు ఎంపీగా గెలిచిన కొద్దిరోజులకే టీడీపీలోకి ఫిరాయించారు. తాత్కాలిక లాభం చూసుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలను బుట్టేయే చెడగొట్టుకున్నారు. పోనీ టీడీపీలోనే ఉన్నారా అంటే అదీలేదు. టీడీపీలో తనకు సరైన గుర్తింపు లేదని చెప్పి 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ బయటకొచ్చేశారు. ఎంతో బతిమలాడుకున్న తర్వాత బుట్టాను పార్టీలో చేర్చుకోవటానికి జగన్ ఒప్పుకున్నారు.
ఎక్కడా టికెట్ ఇచ్చేదిలేదన్న కండీషన్ మీదనే బుట్టాను పార్టీలోకి తీసుకున్నారు. ఆ కండీషన్ ఇంకా ఎంతకాలం కంటిన్యు అవుతుందో తెలీటంలేదు. ప్రస్తుతం సామాజిక సాధికార బస్సుయాత్రలో బిజీగా ఉన్న బుట్టా తనకు జగన్ ఎక్కడో ఒకచోట టికెట్ ఇవ్వకుండా పోతారా అనే ఆశతోనే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఎక్కడా టికెట్ దక్కకపోతే తన పరిస్ధితి ఏమిటనే విషయంలోనే బుట్టాలో టెన్షన్ పెరిగిపోతోందట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.